ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్ ఎంత ప్రైజ్ మనీ అందుకున్నాడో తెలుసా?

Published : Dec 14, 2024, 08:08 PM IST

World Chess Championship Prize Money: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన తెలుగు తేజం దొమ్మరాజు గుకేష్‌కు ప్రశంస వెల్లువెత్తుతున్నాయి. అయితే, భారత జెండాను రెపరెపలాడించిన గుకేష్ ఎంత ప్రైజ్ మనీ అందుకున్నాడో తెలుసా?

PREV
14
ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్ ఎంత ప్రైజ్ మనీ అందుకున్నాడో తెలుసా?
డీ గుకేష్, ప్రపంచ చెస్ ఛాంపియన్

World Chess Championship Prize Money: సింగపూర్‌లో జరిగిన 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 14వ గేమ్‌లో డింగ్ లిరెన్‌ను ఓడించి డి గుకేష్ చరిత్ర సృష్టించారు. 18 ఏళ్ల గుకేష్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన వ్యక్తిగా ఘనత సాధించాడు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించిన తెలుగు బిడ్ద దొమ్మరాజు గుకేష్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

24
డీ గుకేష్ విజయం

డిసెంబర్ 12న, సింగపూర్‌లో డి గుకేష్-చైనా డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ మధ్య నిర్ణయాత్మక మ్యాచ్ జరిగింది. 14వ గేమ్‌లో అతను చివరి కదలికలో డింగ్ లిరెన్‌ను ఓడించాడు. ఈ విజయంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెండవ భారతీయుడిగా 18 ఏళ్ల గుకేష్ ఘ‌న‌త సాధించాడు. 22 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన రష్యా లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ రికార్డును గుకేశ్ బద్దలు కొట్టాడు.

ఈ టోర్నీలో గుకేష్, డింగ్ మధ్య హోరాహోరీగా పోటీ నడిచింది. ఇద్దరూ విజయానికి ఒక్క పాయింట్ దూరంలో ఉండటంతో చివరి గేమ్ పై మరింత ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతి విజయం ఆటగాడికి 1 పాయింట్, డ్రా 0.5 పాయింట్లు లభిస్తాయి.

34
డీ గుకేష్

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ లో దొమ్మరాజు గుకేశ్ మూడు గేమ్‌లు (3, 11, 14 గేమ్‌లు)లలో విజయం సాధించాడు. ఈ మూడు విజ‌యాల‌తో $600,000 (సుమారు రూ. 5.04 కోట్లు) అందుకున్నాడు. ఇక డింగ్ 1, 12 రెండు గేమ్‌లు గెలిచాడు. దీంతో $400,000 (రూ. 3.36 కోట్లు) అందుకున్నాడు. మిగిలిన ప్రైజ్ మ‌నీ   $12.5 మిలియన్లను ఇద్దరు ఆటగాళ్లకు సమానంగా అందించారు.

44
గుకేష్ మన తెలుగోడే

డి గుకేష్ పూర్తి గుకేష్ దొమ్మరాజు. మే 29, 2006లో జన్మించాడు. తెలుగు కుర్రాడైన గుకేష్ తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా. ప్రస్తుతం చెన్నైలో ENT సర్జన్ అయిన డాక్టర్ రజనీకాంత్, మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ పద్మ దంపతులకు జన్మించారు. తెలుగు కుటుంబానికి చెందిన గుకేశ్ ఏడేళ్ల వయసులో చదరంగం ఆడడం ప్రారంభించాడు. 2015లో ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేష్ తన మొదటి ప్రధాన మైలురాయిని- U9 విభాగంలో గెలుచుకున్నాడు. మూడు సంవత్సరాల తరువాత, అతను U12 ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories