Published : Mar 08, 2022, 02:53 PM ISTUpdated : Mar 08, 2022, 02:56 PM IST
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనా, రిప్లేస్‌మెంట్‌గా గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడబోతున్నాడని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తిదేనని తేల్చేసింది గుజరాత్ టైటాన్స్...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఇంగ్లాండ్ ప్లేయర్ జాసన్ రాయ్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్...
29
అయితే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, ఆ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు జాసన్ రాయ్...
39
జాసన్ రాయ్ స్థానంలో ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా, గుజరాత్ టైటాన్స్ తరుపున ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడబోతున్నాడని విపరీతమైన ప్రచారం జరిగింది...
49
అయితే జాసన్ రాయ్ స్థానంలో ఆఫ్ఘాన్ యంగ్ ఓపెనర్ రహ్మెనుల్లా గుర్భాజ్‌ను తీసుకుంటున్నట్టు ప్రకటించింది గుజరాత్ టైటాన్స్...
59
వన్డే ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రహ్మెనుల్లా గుర్భాజ్... కరేబియన్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి టోర్నీల్లో పాల్గొన్నాడు...
69
18 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన రహ్మెనుల్లా గుర్భాజ్ 29.05 సగటుతో 531 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
79
ఓపెనింగ్ బ్యాటర్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ రాణించిన గుర్భాజ్, గుజరాత్ టైటాన్స్‌లో వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్ వంటి వికెట్ కీపర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోతున్నాడు...
89
హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఎంపికైన గుజరాత్ టైటాన్స్, రూ.15 కోట్లతో ఆఫ్ఘాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...
99
Rashid khan
రషీద్ ఖాన్‌ను కూడా డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే...
గుజరాత్ టైటాన్స్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న రషీద్ ఖాన్ రికమెండేషన్‌తోనే రహ్మెనుల్లా గుర్భాజ్, ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేయబోతున్నాడని టాక్...