GT vs LSG LIVE: టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్.. లావెండర్ జెర్సీలో గుజరాత్ టైటాన్స్

Published : May 22, 2025, 07:46 PM IST

IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. క్యాన్సర్ అవగాహన కోసం శుభ్‌మన్ గిల్ జట్టు లావెండర్ జెర్సీలు ధరించింది. 

PREV
16
IPL 2025: గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్‌

IPL 2025 GT vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 64వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ - లక్నో సూపర్ జెయింట్స్‌ తలపడుతున్నాయి. శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు టాస్ గెలిచిన ముందుగా బౌలింగ్  ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు కొత్త జెర్సీలతో బరిలోకి దిగింది. ప్రత్యేక లావెండర్ జెర్సీలను ధరించిన జీటీ ప్లేయర్లు.. క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడానికి తమ మద్దతును ప్రకటించారు.

26
టాస్ తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కామెంట్స్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. “ఇది మంచి వికెట్‌లా ఉంది. మేము లక్ష్యాన్ని ఛేదించడానికి ఇష్టపడతాం. ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ముందు మేము మంచి మోమెంటమ్‌తో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం. నేను, సాయి సుదర్శన్ మధ్య మంచి జోడీగా ఫామ్ లో ఉన్నాము. మేమిద్దరం ఒకే తరహాలో ఆడతాం. ఇది మాకు బాగా పనిచేస్తోంది” అని తెలిపాడు. అలాగే, జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోందని వెల్లడించారు.

36
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఏమన్నారంటే?

టాస్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. “మేము కూడా టాస్ గెలిచి బౌలింగ్‌నే ఎంచుకునేవాళ్లం. కానీ బ్యాటింగ్ మొదలుపెట్టడం పెద్ద విషయం కాదు. ఇప్పటికే ఎలిమినేట్ అయినా, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో జట్టు పోరాటాన్ని ప్రదర్శించాలి” అని అన్నారు. జట్టులోకి ఆకాష్ సింగ్‌ను తీసుకున్నట్టు తెలిపాడు.

46
సాయి సుదర్శన్ vs శుభ్‌మన్ గిల్: ఆరెంజ్ క్యాప్ కోసం బిగ్ ఫైట్

శుభ్‌మన్ గిల్ (601 పరుగులు), సాయి సుధర్శన్ (617 పరుగులు) ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్న ఆటగాళ్లు. వీరి మధ్య 16 పరుగుల తేడా మాత్రమే ఉండటంతో, ఈ మ్యాచ్‌లో వారి ప్రదర్శన ఆధారంగా ర్యాంకింగ్స్‌లో మార్పులు రావచ్చు. ఇద్దరు ప్లేయర్లు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. 

56
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI vs లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), షెర్ఫేన్ రాదర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడా, సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ.

ఇంపాక్ట్ ప్లేయర్లు: సాయి సుదర్శన్, అనుజ్ రవాత్, మహిపాల్ లోంరోర్, వాషింగ్టన్ సుందర్, దసున్ శానకా.

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI

మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్ (దిగ్వేశ్ సింగ్ స్థానంలో), షాబాజ్ అహ్మద్ (రవి బిష్ణోయ్ స్థానంలో), అవేశ్ ఖాన్, ఆకాష్ దీప్, విల్ ఓ’రోర్క్.

ఇంపాక్ట్ ప్లేయర్లు: ఆకాష్ సింగ్, ఎం సిద్ధార్థ్, రవి బిష్ణోయ్, డేవిడ్ మిల్లర్, అర్షిన్ కులకర్ణి.

66
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం రికార్డులు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇప్పటి వరకూ బౌలింగ్‌కు ఎంచుకున్న జట్టు ఒక్కసారే గెలిచింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన జట్లు మాత్రం నాలుగు విజయాలను అందుకున్నాయి. ఈ గణాంకాల ప్రకారం, లక్నోకు తక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రదర్శన ద్వారా తేడా చూపించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ క్యాన్సర్‌పై అవగాహన, ఆటగాళ్ల ప్రదర్శన, ప్లేఆఫ్స్ సమీపంలో ఉన్న జీటీకి కీలకమైనదిగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories