ఏబీ డివిల్లియర్స్ అవమానించేవాడు, గ్రేమ్ స్మిత్ అయితే నేను ఆడకూడదని అనుకున్నాడు...

First Published Jul 20, 2021, 8:59 PM IST

సౌతాఫ్రికా క్రికెట్‌లో జాతి వివక్ష కొత్తేమీ కాదు. ఇప్పటికే జాత్యాహంకారం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైన సఫారీ జట్టులో మరోసారి ఇదే సమస్య... ఇబ్బందులు పెడుతోంది. సఫారీ జట్టులో గ్రేట్ లెజెండరీ క్రికెటర్లుగా గుర్తింపు దక్కించుకున్న ఏబీ డివిల్లియర్స్, గ్రేమ్ స్మిత్‌లపై ఈసారి జాతివివక్ష ఆరోపణలు రావడం విశేషం...

సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో అత్యద్భుతమైన పర్ఫామెన్స్ చూపించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ తమి సోలెకిలే, 2011 నుంచి 15 వరకూ నేషనల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో కేవలం బ్యాకప్ ప్లేయర్‌గానే ఉన్న తమి సోలెకిలే... ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..
undefined
160 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన తమి సోలెకిలే, మూడంటే మూడే అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. అయితే అప్పుడు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ లేకపోయి ఉంటే, తాను మరిన్ని మ్యాచులు ఆడేవాడినని కామెంట్ చేశాడు తమి సోలెకిలే.
undefined
‘అనుభవపూర్వకంగా చెబుతున్నా... మిస్టర్ స్మిత్, ఎప్పుడూ నన్ను తన టీమ్‌లో ఉండాలని కోరుకోలేదు...’ అంటూ ఇద్దరు నేషనల్ సెలక్షన్ కన్వేనర్స్ ఆండ్రూ హడ్సన్, లిండా జోండిలతో కలిసి న్యాయస్థానం ముందు ఈ ఆరోపణలు చేశాడు తమి సోలేకిలే...
undefined
వెస్టర్న్ ప్రోవెన్స్ అండర్13 తరుపున ఆడిన సమయంలో జట్టులోని తెల్లజాతీయులందరూ సుఖంగా బెడ్‌రమ్‌లో పడుకుంటే, తాను, తనతో పాటు ఉన్న నల్లజాతీయులు కిచెన్‌లో పడుకున్నామని తెలియచేశాడు తమి...
undefined
2013లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తనకు చోటు ఉంటుందని సెలక్టర్ హడ్సన్ చెప్పాడు, నేను ఎంతో సంతోషించాడు... ఆ సమయంలో మార్క్ బ్రౌచర్ కంటి గాయంతో బాధపడుతున్నాడు...
undefined
అయితే ఆ సమయంలో కూడా నాకు అవకాశం రాలేదు. ఎందుకంటే బ్రౌచర్ ఉన్నప్పుడు వికెట్ కీపింగ్ చేయని ఏబీ డివిల్లియర్స్, నాకు టీమ్‌లో చోటు దక్కకూడదనే ఉద్దేశంతో వికెట్ కీపింగ్ చేయడానికి రెఢీ అయ్యాడు...
undefined
గ్రేమ్ స్మిత్ చాలా గొప్ప కెప్టెన్. కానీ నా దృష్టిలో మాత్రం అతనికి సౌతాఫ్రికా క్రికెట్ అసోసియేషన్, అతని టీమ్‌‌మేట్స్ చాలా అధికారాలు ఇచ్చారు...అతను ఎప్పుడూ నాతో చనువుగా మాట్లాడింది లేదు, నాతోనే కాదు, నాలాంటి నల్ల జాతీయులతో కూడా. అతనితో నాకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవు...
undefined
అండర్19 టీమ్‌లో ఉన్నప్పుడు నేను అతనికి కెప్టెన్‌ని, కొన్ని సమయాల్లో అతనికి ప్రత్యర్థిగా కూడా ఆడాను. అందుకే నన్ను ఇంతగా ద్వేషించడానికి కారణం ఏంటా? అని చాలాసార్లు ఆలోచించాను...
undefined
నేను తన జట్టులో ఉండడం ఇష్టం లేదని గ్రేమ్ స్మిత్, తనతో చెప్పినట్టు సెలక్టర్లు కూడా నాతో అన్నారు... ప్రతీ టూర్‌కి వెళ్లిన సమయంలో ఇదే జరిగేది. నేను నాకు ఛాన్స్ వస్తుందని, ఆఖరి మ్యాచ్ దాకా ఎదురుచూస్తూ ఉండేవాడిని.
undefined
కాని ఎప్పుడూ ఆ అవకాశం వచ్చేది కాదు. 2012లో ఇంగ్లాండ్‌ టూర్‌కి ఎంపికయ్యాను. ఆ తర్వాతి ఏడాది ఆస్ట్రేలియా టూర్‌లో... ఇలా నా కెరీర్ మొత్తం’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు తమీ సోలెకిలే. తాను నల్లజాతీయుడిని కావడం వల్లే ఇలా వివక్ష చూపించారంటూ ఆరోపించాడు తమీ సోలెకిలే.
undefined
click me!