IPL: సీఎస్కే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రూ. 14 కోట్లు సేఫ్.. ఆ ఆటగాడు ఫిట్..?

Published : Mar 09, 2022, 10:55 AM IST

Deepak Chahar: ఈనెల 26 నుంచి ఐపీఎల్ మెగా సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభవార్త. ఇటీవలే ముగిసిన వేలంలో  రూ. 14 కోట్లతో దక్కించుకున్న  స్టార్ ఆల్ రౌండర్... 

PREV
17
IPL: సీఎస్కే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రూ. 14 కోట్లు సేఫ్.. ఆ ఆటగాడు ఫిట్..?

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో  రూ. 14 కోట్లు దక్కించుకున్న ఆటగాడు కీలక సీజన్ ముందు గాయాల బారీన పడితే ఆ ఫ్రాంచైజీతో పాటు అభిమానులకు కూడా తీవ్ర నిరాశే. 

27

నిన్నటిదాకా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులదీ దాదాపు ఇదే పరిస్థితి. గత నెలలో ముగిసిన ఐపీఎల్ వేలంలో సీఎస్కే.. రూ. 14 కోట్లు వెచ్చించి  టీమిండియా యువ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ను కొనుగోలు చేసింది. 

37

అయితే  తీరా వెస్టిండీస్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఆఖరి టీ20 లో గాయపడి.. జట్టుకు దూరమయ్యాడు.  ఈ సందర్భంగా అతడికి  వైద్య పరీక్షలు నిర్వహించగా..  చాహర్ కు సర్జరీ అవసరమని, రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ వైద్య బృందం తేల్చింది. 

47

అయితే  తాజాగా  వస్తున్న సమాచారం సీఎస్కే అభిమానులకు శుభవార్తే. చాహర్ తన గాయం నుంచి కోలుకుంటున్నాడని, సర్జరీ కూడా అవసరం లేదని  వైద్యులు తేల్చినట్టు తెలుస్తున్నది. 

57

ప్రస్తుతం  బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న చాహర్..  త్వరగా రికవరీ అవుతున్నాడని.. సర్జరీ అవసరం లేదని.. ఏప్రిల్ మధ్యలో  ఐపీఎల్ ఆడొచ్చని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. 

67

ఈ నేపథ్యంలో చెన్నై.. అతడిని ఎన్సీఏ నుంచి విడుదల చేయడానికి బీసీసీఐకి వినతిపత్రం కూడా అందించనుంది. తమ జట్టు, ఐపీఎల్ ఫిజియోల వద్ద చాహర్ కు  నాణ్యమైన వైద్యం అందిస్తామని బీసీసీఐకి లేఖ రాయనున్నట్టు తెలుస్తున్నది.

77

సీఎస్కే ప్రస్తుతం గుజరాత్ లోని సూరత్ లో గల ఓ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే.  జట్టు సారథి ఎంఎస్ ధోనితో పాటు ఇతర ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది సూరత్ లో ప్రాక్టీస్ సెషన్ లో గడుపుతున్నారు. బహుశా ఏప్రిల్ రెండో వారంలో చాహర్ కూడా జట్టుతో చేరే అవకాశాలున్నాయని  సీఎస్కే వర్గాలు తెలిపాయి. 

click me!

Recommended Stories