ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేస్తున్న ఎమ్మెస్ ధోనీ లుక్స్... బారెడు పొట్టతో పోలార్డ్‌లా మారావంటూ...

Published : Mar 08, 2022, 06:28 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి పూర్తిగా స్వస్తి పలికేశాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పుడు కేవలం ఐపీఎల్‌ మ్యాచులకు మాత్రమే పరిమితమయ్యాడు... ఐపీఎల్‌కి ముందు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తాడంతే!  

PREV
113
ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేస్తున్న ఎమ్మెస్ ధోనీ లుక్స్...  బారెడు పొట్టతో పోలార్డ్‌లా మారావంటూ...

ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు ఏ మాత్రం బ్యాటింగ్ ప్రాక్టీస్ లేకుండా బరిలో దిగి, ఘోరంగా ఫెయిల్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ... 

213

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచినా, కెప్టెన్ మాహీ బ్యాటుతో ఇచ్చిన కాంట్రిబ్యూషన్ శూన్యం... 

313

రిటైర్మెంట్‌కి ముందు చాలా ఏళ్ల నుంచి జిడ్డు బ్యాటింగ్ చేస్తున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న మాహీ, ఫిట్‌నెస్‌పై కూడా సరిగా ఫోకస్ పెట్టడం లేదు...

413

ఐపీఎల్ 2022 సీజన్ ప్రమోషన్ కోసం వివిధ రకాల గెటప్పులో కనిపించిన ఎమ్మెస్ ధోనీ, సూరత్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన క్యాంపులో పాల్గొంటున్నాడు...

513

ప్రాక్టీస్ సెషన్స్‌లో ఎమ్మెస్ ధోనీ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ ఫోటోలను చూసిన వాళ్లు, మాహీ లుక్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు...

613

హెయిర్ స్టైల్ విషయంలో పూర్తి శ్రద్ద తీసుకుని, స్టైలిష్ అవతారంలోకి మారిపోయిన ఎమ్మెస్ ధోనీ, బాడీ షేపింగ్‌పై మాత్రం ఏ మాత్రం ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదు...

713

పొట్ట బాగా పెరిగిపోయి, ఎమ్మెస్ ధోనీ చూడడానికి విండీస్ ఆల్‌రౌండర్‌ కిరన్ పోలార్డ్‌కి తమ్ముడిలా కనిపిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

813

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎమ్మెస్ ధోనీ బ్యాటుతో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్‌ల కారణంగా టైటిల్ కొట్టేసింది సీఎస్‌కే...

913

అయితే గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అదరగొట్టిన ఫాఫ్ డుప్లిసిస్, శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్‌లో వేరే జట్ల తరుపున ఆడబోతున్నాడు...
 

1013

ఐపీఎల్ 2022 వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొన్న దీపక్ చాహార్, గాయం కారణంగా పూర్తి సీజన్ అందుబాటులో ఉండడం లేదు...

1113

ఐపీఎల్ కెరీర్‌లో సీఎస్‌కే మూడు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనా సరైన ఫామ్‌లో లేడని తీసి పక్కనబెట్టేసింది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్...

1213

ఇప్పుడు ఎమ్మెస్ ధోనీ ఫిజిక్ చూస్తుంటే... మాహీ మునుపటిలా వికెట్ల మధ్యన మెరుపు వేగంతో సింగిల్స్ తీయడం కష్టమేనని అని భయపడుతున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

1313

మరికొందరు మాత్రం ఫిట్‌నెస్ లేకపోయినా ఎమ్మెస్ ధోనీ, పోలార్డ్‌లా హెలికాఫ్టర్ షాట్స్, సింగిల్ హ్యాండ్ సిక్సర్లతో ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తే చాలని కామెంట్లు చేస్తున్నారు. 

click me!

Recommended Stories