ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ ఎవరు? క్రికెట్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న ప్రశ్న ఇది. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్‌గా ఇదే తనకు ఆఖరి సీజన్ అంటూ బాంబ్ పేల్చాడు విరాట్ కోహ్లీ...
ఐపీఎల్ 2013 నుంచి ఆర్‌సీబీ కెప్టెన్‌గా 9 సీజన్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, 2016లో జట్టును ఫైనల్ చేర్చినా టైటిల్ అందించలేకపోయాడు...
211
విరాట్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను అట్టిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2021 సీజన్ కెప్టెన్‌ను ప్రకటించేందుకు మార్చి 12 వరకూ ముహుర్తం పెట్టుకుంది...
311
కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఐపీఎల్ 2022 సీజన్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్... పంజాబ్ కింగ్స్ జట్టు, మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా ప్రకటించినా ఆర్‌సీబీ కెప్టెన్ ఎవరనే విషయంపై క్లారిటీ రావడం లేదు..
411
ఐపీఎల్ 2022 సీజన్ జట్టులో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు వేలంలో కొనుగోలు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, దినేశ్ కార్తీక్‌లకు కెప్టెన్సీ చేసిన అనుభవం పుష్కలంగా ఉంది...
511
వీరిలో ఫాఫ్ డుప్లిసిస్‌కి ఆర్‌సీబీ 2022 సీజన్ కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఐపీఎల్ 2021 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ కూడా ఇదే కామెంట్ చేశాడు...
611
అయితే ఆర్‌సీబీ తాజాగా విడుదల చేసిన కెప్టెన్ స్టిల్స్ చూస్తుంటే మాత్రం... ఈ సీజన్‌లో కూడా విరాట్ కోహ్లీయే కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి...
711
ఆర్‌సీబీ జెర్సీలో విరాట్ కోహ్లీ ఇచ్చిన ఫోజుల్లాంటి ఫోజుల్లో తల కనిపించకుండా నెక్ట్స్ కెప్టెన్ ఇచ్చిన స్టిల్స్‌ను పోస్టు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
811
అయితే విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ బాడీ చూడడానికి ఒకేలా అనిపిస్తాయి. ఈ ఇద్దరితో పోలిస్తే దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫిజిక్ వేరు...
911
కాబట్టి విరాట్ కోహ్లీ కాకపోతే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లిసిస్ వ్యవహరించబోతున్నాడని అంటున్నారు ఫ్యాన్స్...
1011
అయితే ఆర్‌సీబీ అన్‌బ్యాక్స్ అంటూ విడుదల చేసిన కొత్త లోగోలో సింహం గోల్డెన్ కలర్ కళ్లద్దాలు పెట్టుకున్నట్టుగా డిజైన్ ఉంది...
1111
ఇలాంటి కళ్లద్దాలకు పాపులారిటీ తెచ్చి పెట్టింది క్రికెటర్ దినేశ్ కార్తీక్. కాబట్టి ఆర్‌సీబీ 2022 సీజన్ కెప్టెన్సీ దినేశ్ కార్తీక్ కూడా దక్కవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు..