మహ్మద్ రిజ్వాన్ రికార్డుల మోత... టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్...

First Published Dec 17, 2021, 9:42 AM IST

వెస్టిండీస్‌‌ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్టార్ ప్లేయర్లు దూరంగా ఉండడం, కరోనా కారణంగా ఆరుగురు ప్లేయర్లు దూరం కావడంతో విండీస్ వరుసగా మూడు టీ20 మ్యాచుల్లోనూ ఓడింది...

కరాచీ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రండన్ కింగ్ 43, షామర్ బ్రూక్స్ 49, నికోలస్ పూరన్ 64, బ్రావో 34 పరుగులతో రాణించారు. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది పాకిస్తాన్...

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 45 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేయగా కెప్టెన్ బాబర్ ఆజమ్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. ఫకార్ జమాన్ 12 పరుగులు చేయగా అసిఫ్ ఆలీ తన స్టైల్‌లో 7 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు..

ఈ ఇన్నింగ్స్‌తో కలిపి ఈ ఏడాది టీ20ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు మహ్మద్ రిజ్వాన్. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 2వేలకు పైగా టీ20 పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రిజ్వాన్...

రిజ్వాన్ 45 ఇన్నింగ్స్‌ల్లో 2004 పరుగులు చేయగా, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 1746 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 2015లో క్రిస్ గేల్ 36 ఇన్నింగ్స్‌ల్లో 1665 పరుగులు, 2016లో విరాట్ కోహ్లీ 29 ఇన్నింగ్స్‌ల్లో 1614 పరుగులు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు..

అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 1326 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఏడాది 13 హాఫ్ సెంచరీలు చేసిన రిజ్వాన్, 119 ఫోర్లు బాది టాప్‌లో నిలిచాడు...

అంతేకాకుండా ఈ ఏడాది టీ20ఐల్లో 983 బంతులు ఎదుర్కొన్న మహ్మద్ రిజ్వాన్, అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా 42 సిక్సర్లతో టాప్‌లో నిలిచాడు...

అయితే 2016లో విరాట్ కోహ్లీ 106.82 యావరేజ్‌తో పరుగులు చేస్తే, మహ్మద్ రిజ్వాన్ సగటు ఈ ఏడాది 73.66గా ఉంది. జోస్ బట్లర్ 65.44 సగటుతో పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు...

ఈ ఏడాది టీ20ల్లో 20 సార్లు 30+ స్కోర్లు చేసిన రిజ్వాన్, అత్యధిక సార్లు ఈ ఫీటట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఈ ఏడాది రిజ్వాన్ ఐదు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలవడం విశేషం..

1998లో సచిన్ టెండూల్కర్ ఒకే ఏడాదిలో ఐదు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలవగా, రిజ్వాన్ ఆ రికార్డును సమం చేశాడు. ఈ ఏడాది 14 సార్లు పాక్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచిన రిజ్వాన్, 1996లో వన్డేల్లో 16 సార్లు టాప్ స్కోరర్‌గా నిలిచిన సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు..

click me!