IPLAuction2021: వేలానికి ముందు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మార్కెటింగ్ స్ట్రాటెజీ... కోహ్లీ కెప్టెన్సీలో ఆడతానంటూ..

First Published Feb 18, 2021, 12:26 PM IST

గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఎలాంటి బౌలర్‌ బౌలింగ్‌లోనైనా భారీ సిక్సర్లు కొట్టగల మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మెన్లలో ఒకడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించే గ్లెన్ మ్యాక్స్‌వెల్, గత సీజన్‌లో 13 మ్యాచులు ఆడినా, ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. తన ఆటతీరుతో అనేక విమర్శలు ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్, మరోసారి ఐపీఎల్ వేలంలో హాట్ ఫెవరెట్‌ అయ్యాడు...అయితే అట్టర్ ఫ్లాప్ సీజన్ తర్వాత హాట్ ఫెవరెట్‌గా మారడం వెనక అతని మార్కెటింగ్ స్ట్రాటెజీ ఉంది...

గత సీజన్‌లో ఏకంగా రూ.10 కోట్ల 75 లక్షలు పెట్టి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఈ ఆసీస్ ఆల్‌రౌండర్, మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌తో అదరగొడతాడనే ఆశతో ఫెయిల్ అవుతున్నా, వరుస అవకాశాలు ఇచ్చింది.
undefined
13 మ్యాచులు ఆడిన మ్యాక్సీ, 108 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాక్స్‌వెల్ పర్ఫామెన్స్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
undefined
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే మ్యాక్స్‌వెల్‌ను ‘పది కోట్ల ఖరీదైన ఛీర్ లీడర్’ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఐపీఎల్ తర్వాత జరిగిన టీ20, వన్డే టోర్నీలో సిక్సర్ల మోత మోగించాడు మ్యాక్స్‌వెల్.
undefined
‘విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. అతనికి ప్రత్యర్థిగా ఆడడం కంటే, అతనితో కలిసి ఆడడం చాలా బాగుంటుంది. అతని కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా...’ అంటూ ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.
undefined
భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయాలని సూచించాడు. దేవ్‌దత్ పడిక్కల్‌తో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసి, వన్‌డౌన్‌లో మ్యాక్స్‌వెల్‌ను పంపిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు గంభీర్...
undefined
వేలానికి ముందు మ్యాక్స్‌వెల్, గంభీర్ చేసిన వ్యాఖ్యలు, వేలంలో జరిగే పోటీని డిసైడ్ చేయబోతున్నాయి. మ్యాక్స్‌వెల్‌ను ఎలాగైనా కొనుగోలు చేయాలని ఆర్‌సీబీ ప్రయత్నిస్తుందని మిగిలిన జట్లు భావిస్తే, అతనికి మరోసారి మంచి ధర దక్కే అవకాశం ఉంటుంది. అందుకే మ్యాక్స్‌వెల్, ఈ విధంగా మార్కెటింగ్ స్ట్రాటెజీ వాడాడు.
undefined
2019 మినహా ఇస్తే తొమ్మిది సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, 2014లో మాత్రమే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ సీజన్‌లో 16 మ్యాచులు ఆడి, 34.50 సగటు, 187.75 స్ట్రైయిక్ రేటుతో 552 పరుగులు చేశాడు మ్యాక్స్‌వెల్. 2014 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన మ్యాక్స్‌వెల్, తన జట్టును ఐపీఎల్ ఫైనల్‌కి చేర్చాడు.
undefined
మొత్తంగా ఐపీఎల్ కెరీర్‌లో 82 మ్యాచులు ఆడిన మ్యాక్స్‌వెల్, 22.13 సగటుతో 1505 పరుగులు చేశాడు. గత సీజన్‌లో మ్యాక్స్‌వెల్ స్ట్రైయిక్ రేటు కేవలం 101.88 మాత్రమే కానీ ఓవరాల్‌గా అయితే స్ట్రైయిక్ రేటు 154.67గా ఉంది...
undefined
ఐపీఎల్ కెరీర్‌లో 91 సిక్సర్లు బాదిన మ్యాక్స్‌వెల్, 118 ఫోర్లతో 6 హాఫ్ సెంచరీలు కూడా నమోదుచేశాడు. అతని అత్యధిక స్కోరు 95 పరుగులు. బౌలింగ్‌లోనూ 19 వికెట్లు తీసిన మ్యాక్స్‌వెల్, ఓవరాల్‌గా 8.57 ఎకానమీతో బౌలింగ్ చేశాడు.
undefined
2020 అట్టర్ ఫ్లాప్ సీజన్ తర్వాత మినీ వేలంలో హాట్ ఫెవరెట్‌గా నిలిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం మరోసారి రూ.10 కోట్లు చెల్లిస్తే మాత్రం అది వెర్రితనమే అవుతుంది.అప్పుడప్పుడూ మాత్రమే పర్ఫామెన్స్ ఇచ్చే మ్యాక్స్‌వెల్ లాంటి ప్లేయర్ కోసం మహా అయితే రూ.4 కోట్ల వరకూ వెచ్చించవచ్చని విశ్లేషకుల అంచనా.
undefined
click me!