IPL 2020: ఐపీఎల్‌లో సెంచరీల మోత, రికార్డులు ఇవే...

First Published Sep 16, 2020, 4:33 PM IST

పొట్టి ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీ చేయడమే గొప్ప, అలాంటిది సెంచరీతో మోత మోగిస్తే... ఐపీఎల్ చరిత్రలో ఇప్పటిదాకా 58 శతకాలు నమోదయ్యాయి. మిగిలిన దేశాల లీగ్‌లతో పోలిస్తే, ఇది చాలా ఎక్కువ. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తూ, బౌలర్లను చీల్చి చెండాడుతూ చెలరేగిపోయారు బ్యాట్స్‌మెన్. ఐపీఎల్‌లో నమోదైన సెంచరీల్లో 18 శతకాలు 50 బంతుల్లోపు బాదినవే. అలాంటి టాప్ 10 సెంచరీలు ఇవి.

10. ఐపీఎల్‌లో మొదటి సెంచరీ బాదింది న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్. 2008లో బెంగళూరుపై 73 బంతుల్లో 158 పరుగులు చేశాడు మెక్‌కల్లమ్.
undefined
9. ఐపీఎల్‌లో మొట్టమొదటి సెంచరీ చేసిన భారత క్రికెటర్ మనీశ్ పాండే. 2009లో 73 బంతుల్లో 114 పరుగులు చేశాడు పాండే. అయితే 67 బంతుల్లో శతకం బాదిన మనీశ్ పాండే, ఐపీఎల్‌లో సెంచరీకి అత్యధిక బంతులు వాడిన క్రికెటర్‌గా నిలిచాడు.
undefined
8. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరిట 14 సెంచరీలు ఉన్నాయి. వీటిల్లో విరాట్ కోహ్లీ, క్రిస్‌గేల్ కలిసి 10 సెంచరీలు చేశారు.
undefined
7. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుపైన ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చేసిన సెంచరీలు 7. మరే జట్టుపై ఇన్ని సెంచరీలు నమోదుకాలేదు.
undefined
6. ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో సెంచరీ బాదిన ఒకే ఒక్క క్రికెటర్‌గా వృద్ధమాన్ సాహా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి కోల్‌కత్తా విజయం సాధించింది.
undefined
5. వీరేంద్ర సెహ్వాగ్, బ్రెండన్ మెక్‌కల్లమ్, మురళీ విజయ్, ఆమ్లా, గిల్‌క్రిస్ట్, రహానే, సంజూ శాంసన్ ఐపీఎల్‌లో రెండేసి సెంచరీలు చేశారు.
undefined
4. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిల్లియర్స్‌ ఐపీఎల్‌లో మూడు సెంచరీలు నమోదుచేశాడు.
undefined
3. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ ఐపీఎల్ కెరీర్‌లో నాలుగేసి శతకాలు సాధించారు.
undefined
2. ఐపీఎల్‌లో ఐదు సెంచరీలు చేసిన ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... టాప్ ప్లేస్‌కి ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు.
undefined
1. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు కరేబియన్ వీరుడు క్రిస్‌గేల్. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 6 సెంచరీలు బాదిన గేల్, 30 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకుని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదుచేశాడు. 66 బంతుల్లో 175 పరుగులు చేసిన క్రిస్‌గేల్, లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు నమోదుచేశాడు.
undefined
click me!