మ్యాక్స్ వెల్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ.. రొమాంటిక్ పోస్ట్..!

First Published | Feb 24, 2021, 1:37 PM IST

గత ఏడాది సీజన్ వేలంలో మ్యాక్స్ వెల్ కోసం 10.75 కోట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వెచ్చించింది. ఈ ఏడాది మాత్రం అత్యధికంగా రూ.14కోట్లకు పైగా అమ్ముడవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 

ఐపీఎల్ 2021 సీజ‌న్ కు జ‌రిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియ‌న్ విధ్వంసక బ్యాట్స్ మెన్ మ్యాక్స్ వెల్ కోసం చాలా మంది పోటీప‌డ్డారు. త‌న స్థాయి మేర‌కు ఆడ‌క‌పోయినా మ్యాక్స్ వెల్ కోసం టీమ్స్ అన్ని పోటీ ప‌డ్డాయి.
ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ 2021 వేలంలో అధిక ధర పలికాడు. బిడ్డింగ్ వార్‌లో 14.25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాక్స వెల్ ను సొంతం చేసుకుంది. రూ.14.25 కోట్లకు మ్యాక్స్ వెల్ ను బెంగళూరు దక్కించుకుంది.

గత ఏడాది సీజన్ వేలంలో మ్యాక్స్ వెల్ కోసం 10.75 కోట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వెచ్చించింది. ఈ ఏడాది మాత్రం అత్యధికంగా రూ.14కోట్లకు పైగా అమ్ముడవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా మ్యాక్స్ వెల్ ఓ రొమాంటిక్ పోస్టు పెట్టగా... అది ఇప్పుడు వైరల్ గా మారింది.
గతేడాది ఫిబ్రవరిలో మ్యాక్స్ వెల్ ఇండియన్ యువతి విన్నీ రామన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సరిగ్గా.. ఎంగేజ్మెంట్ జరిగి సంవత్సరం కావస్తోంది.
ఈ నేపథ్యంలో.. ఎంగేజ్మెంట్ యానివర్శకీ సంబంధించి స్పెషల్ పోస్టు పెట్టాడు. విన్నీ రామన్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశాడు.
కాగా... మ్యాక్స్ వెల్ కాబోయే భార్య విన్నీ రామన్ భారత సంతతి యువతి కావడం గమనార్హం. ఆమె పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో అయినప్పటికీ.. ఆమె తల్లిదండ్రులది మాత్రం దక్షిణ భారత దేశం కావడం విశేషం.
కాగా.. విన్నీ రామన్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. వీరి ఎంగేజ్మెంట్ తర్వాత మ్యాక్స్ వెల్ ని చాలా మంది ట్రోల్ చేశారు. అతనిని కాకుండా భారతీయుడిని పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఆమెకు చాలా మంది మెసేజ్ లు చేశారు. అయితే.. వాటికి ఆమె కౌంటర్ కూడా ఇచ్చారు.
లాక్ డౌన్ లో తనకు చాలా సమయం దొరికిందని.. చాలా మందిని ఎడ్యుకేట్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఆస్ట్రేలియన్ ని ప్రేమించడం అంటే... ఇండియాను గౌరవించకపోవడం కాదని ఆమె పేర్కొన్నారు.
తాను మ్యాక్స్ వెల్ ని ఇష్టపడ్డానని.. ఆ విషయంలో ఎవరు ఏం చెప్పినా.. తాను వినని ఆమె పేర్కొన్నారు.
వీరి నిశ్చితార్థం మోడ్రన్ గానై, భారత సంప్రదాయం ప్రకారం రెండు రకాలుగా జరగడం గమనార్హం.

Latest Videos

click me!