అశ్విన్ రీఎంట్రీ కష్టమే, అతనికి చాలా పోటీ ఉంది... సునీల్ గవాస్కర్ కామెంట్...

First Published Feb 22, 2021, 7:55 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్, భారత జట్టు రిజర్వు బెంచ్ స్టామినాకు సాక్ష్యంగా నిలిచింది. సీనియర్ పేసర్లు, సీనియర్ స్పిన్నర్లు ఎవ్వరూ లేకుండా బరిలో దిగిన యంగ్ టీమిండియా, గబ్బాలో చారిత్రక విజయం సాధించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి జట్టుకి దూరమైతే మళ్లీ రీఎంట్రీ కష్టమే...

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ విజయంతో భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఆడిలైడ్ టెస్టు నుంచి సిడ్నీ టెస్టు దాకా బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన అశ్విన్, మూడో టెస్టులో విహారితో కలిసి చారిత్రక ఇన్నింగ్స్ నిర్మించాడు...
undefined
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ రాణిస్తున్న రవిచంద్రన్ అశ్విన్, వన్డే, టీ20 జట్టుల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే అశ్విన్ ఆశ నెరవేరడం కష్టమేనని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
undefined
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే... బాల్‌తో మాత్రమే రాణిస్తే సరిపోదు, బ్యాటుతోనూ ఆకట్టుకోవాలి...
undefined
ప్రస్తుత పరిస్థితుల్లో అశ్విన్ వన్డే, టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం చాలా కష్టమైన పని. టీ20 జట్టులో అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడో స్థానంలో హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత రవీంద్ర జడేజా ఉన్నారు...
undefined
బౌలింగ్‌లో వికెట్లు తీయడంతో పాటు పరిస్థితులకు తగ్గట్టుగా సిక్సర్లు బాది, స్కోరు బోర్డును పరుగెత్తించడంతో వీళ్లు సిద్ధహస్తులు. ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలో దిగుతున్న టీమిండియా, జడ్డూతో పాటు చాహాల్‌కి మాత్రమే జట్టులో చోటు ఇస్తోంది...
undefined
అయితే చాహాల్ ఫెయిల్ అయినా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లకు అవకాశం దక్కొచ్చు. రవిచంద్రన్ అశ్విన్, వన్డేల్లో రావడం దాదాపు అసాధ్యమే...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
undefined
2017లో చివరిగా వన్డే మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్, ఆ తర్వాత కేవలం టెస్టు సిరీస్‌కి మాత్రమే పరిమితమయ్యాడు. చాహాల్ - కుల్దీప్ యాదవ్, అశ్విన్ - రవీంద్ర జడేజా స్పిన్ ద్వయంగా కెరీర్ ఆరంభించినా అశ్విన్ టెస్టులకు, చాహాల్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కి పరిమితమయ్యారు...
undefined
టీమిండియా తరుపున 111 వన్డేలు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 150 వికెట్లు తీశాడు. 42 టీ20 మ్యాచులు ఆడి 52 వికెట్లు తీశాడు...
undefined
click me!