RCBvsKKR: అదరగొట్టిన ఏబీ డివిల్లియర్స్, మ్యాక్స్‌వెల్... ఆర్‌సీబీ భారీ స్కోరు...

Published : Apr 18, 2021, 05:22 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన జట్లు 150 పరుగుల స్కోరు చేయడానికి కష్టపడిన చోట, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ విఫలమైనా గ్లెన్ మ్యాక్స్‌వెల్ మెరుపులు, ఆఖర్లో ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్ అద్భుత ఇన్నింగ్స్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

PREV
19
RCBvsKKR: అదరగొట్టిన ఏబీ డివిల్లియర్స్, మ్యాక్స్‌వెల్... ఆర్‌సీబీ భారీ స్కోరు...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రెండో ఓవర్‌లో గట్టి షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

29

ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన రజత్ పటిదార్‌ను కూడా క్లీన్‌బౌల్డ్ చేశాడు వరుణ్ చక్రవర్తి. దీంతో 9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

39

దేవ్‌దత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి మూడో వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దేవ్‌దత్ సింగిల్స్ తీస్తూ మ్యాక్స్‌వెల్‌కి స్ట్రైయికింగ్ ఇవ్వగా, మ్యాక్స్‌వెల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.

49

28 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌ల రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఆర్‌సీబీ.

59

ఏబీ డివిల్లియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ కలిసి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మ్యాక్స్‌వెల్ 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

69

సీజన్‌లో వరుసగా మూడోసారి 30+ పరుగులు చేసిన మ్యాక్స్‌‌వెల్, వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు మ్యాక్స్‌వెల్...

79

ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో మ్యాక్స్‌‌వెల్ అవుటైన తర్వాత మరింత జోరు పెంచిన ఏబీ డివిల్లియర్స్, రస్సెల్ వేసిన 18వ ఓవర్‌లో 17 పరుగులు, హర్భజన్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 18 పరుగులు రాబట్టాడు.

89

ఆండ్రూ రస్సెల్ వేసిన 20వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు రాబట్టిన ఏబీ డివిల్లియర్స్, 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

99

కేల్ జెమ్మీసన్‌ కూడా 4 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 11 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగుల భారీ స్కోరు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

click me!

Recommended Stories