ఏదో రోజు టైటిల్ గెలుస్తాం, ఆరోజున ఏం చేస్తామో... ఏబీ డివిల్లియర్స్ కామెంట్...

Published : Apr 18, 2021, 04:54 PM IST

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ఎప్పుడు గెలుస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. 13 సీజన్లు గడిచాయి కానీ టైటిల్ మాత్రం రాలేదు. ప్రతీసారి ‘ఈ సాల్ కప్ నమ్‌దే’ అంటూ ఆశగా సీజన్‌ను ప్రారంభించించడం, నిరాశగా ముగించడం ఆనవాయితీగా మారింది...

PREV
19
ఏదో రోజు టైటిల్ గెలుస్తాం, ఆరోజున ఏం చేస్తామో... ఏబీ డివిల్లియర్స్ కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్‌ను రెండు వరుస విజయాలతో ఆరంభించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2021 సీజన్‌లో రెండు మ్యాచులు ఆడి ఓటమి చవిచూడని జట్టు కూడా ఆర్‌సీబీయే...

29

పాత మాటే అయినా ఈసారి మాత్రం టైటిల్ గెలవగలమనే ధీమాను వ్యక్తం చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్...

39

‘ఆర్‌సీబీ టైటిల్ ఎప్పుడు గెలుస్తుందా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి మిమ్మల్ని నిరాశపరచం. టైటిల్ గెలవడానికి నూటికి రెండు వందల శాతం ప్రయత్నిస్తాం...

49

ఏదో ఒక రోజు టైటిల్ గెలుస్తాం... ఆ రోజున ఎలా ఫీల్ అవుతామో చెప్పలేము... ఆ అనుభూతి పొందడానికి అభిమానుల కంటే మేమే ఎక్కువగా ఎదురుచూస్తున్నాం...

59

కరోనా కారణంగా సొంత మైదానంలో ఆడే అవకాశం ఏ జట్టూకి లేకపోవడంతో ఐపీఎల్ 2021 సీజన్ పూర్తి భిన్నంగా మారిపోయింది. ఇది మాకో మంచి అవకాశం అనుకుంటున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఏబీ డివిల్లియర్స్...

69

2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఏబీ డివిల్లియర్స్‌ని, రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాడు సౌతాఫ్రికా కోచ్ మార్క్ బ్రౌచర్...

79

అయితే ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే విషయం గురించి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఏబీ డివిల్లియర్స్...

89

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆప్తమిత్రుడైన ఏబీ డివిల్లియర్స్, ఐపీఎల్ ఆడితే ఆర్‌సీబీ తరుపున మాత్రమే ఆడతానని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

99

గత సీజన్ ఆరంభంలో కూడా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన ఆర్‌సీబీ మొదటి 9 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో గెలిచింది. అయితే ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

click me!

Recommended Stories