బెన్‌స్టోక్స్‌కి వీడ్కోలు పలికిన రాజస్థాన్ రాయల్స్... గుర్తుండిపోయే బహుమతితో...

Published : Apr 18, 2021, 04:14 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్‌కి గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 

PREV
19
బెన్‌స్టోక్స్‌కి వీడ్కోలు పలికిన రాజస్థాన్ రాయల్స్... గుర్తుండిపోయే బహుమతితో...

పంజాబ్ కింగ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ కొట్టిన క్యాచ్ అందుకునే సమయంలో బెన్ స్టోక్స్ డైవ్ చేయడంతో అతని చేతి వేలి ఎముక విరిగినట్టు తేల్చారు డాక్టర్లు...

29

దాంతో చేతి వేలి సర్జరీ కోసం ఇంగ్లాండ్ బయటుదేరి వెళ్లాడు బెన్ స్టోక్స్. సీజన్‌లో ఒకే మ్యాచ్‌ ఆడి స్వదేశానికి పయమనమైన బెన్ స్టోక్స్‌కి గుర్తిండిపోయే జ్ఞాపికను అందచేసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. 

39

బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్, ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత క్యాన్సర్‌తో మరణించారు. ఐపీఎల్ 2020 సమయంలోనే తండ్రి అనారోగ్యం కారణంగానే ఆలస్యంగా జట్టుతో కలిశాడు బెన్‌స్టోక్స్. 

49

బెన్ స్టోక్స్‌కి జ్ఞాపికగా తండ్రి పేరుతో ముద్రించిన జెర్సీని అతనికి అందచేసింది ఆర్ఆర్. ఆర్ఆర్ ఇచ్చిన బహుమతిని అందుకున్న బెన్ స్టోక్స్ ఎమోషనల్ అయ్యాడు.

59

టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 99 పరుగుల వద్ద అవుటైన బెన్ స్టోక్స్, ఆకాశాన్ని చూస్తూ ‘సారీ డాడ్’ అంటూ చెప్పిన విషయం తెలిసిందే..

69

వాస్తవానికి గాయం విషయం తెలిసిన తర్వాత కూడా రాజస్థాన్ రాయల్స్‌ జట్టుతోనే ఉండి, టీమ్‌కి సపోర్టుగా నిలవాలని భావించాడు బెన్ స్టోక్స్...

79

అయితే బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఈ టైమ్ గ్యాప్‌లో శస్త్రచకిత్స చేయించుకోవాలని బెన్‌స్టోక్స్‌ని కోరింది ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్. దీంతో సర్జరీ కోసం ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లాడు బెన్ స్టోక్స్...

89

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బెన్‌స్టోక్స్, ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడి జట్టుకు దూరం కావడం రాజస్థాన్ రాయల్స్ విజయావకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు..

99

అయితే బెన్ స్టోక్స్ లేకుండా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే మంచి విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. క్రిస్ మోరిస్ నాలుగు సిక్సర్లతో విరుచుకుపడి, ఢిల్లీపై మ్యాచ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే.

click me!

Recommended Stories