ఇప్పుడే కాదు.. ఆ బౌలర్ ను టీ20 ప్రపంచకప్ కు కూడా ఎంపికచేయొద్దు : రవిశాస్త్రి

Published : Jun 11, 2022, 11:44 AM IST

Umran Malik: ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శనలతో జాతీయ జట్టులోకి ఎంపికైన  జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ను ఇప్పుడే టీ20లు ఆడించొద్దని  అంటున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. 

PREV
17
ఇప్పుడే కాదు.. ఆ బౌలర్ ను టీ20 ప్రపంచకప్ కు కూడా ఎంపికచేయొద్దు : రవిశాస్త్రి

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ తో పాటు ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్  కు సన్ రైజర్స్  హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేయొద్దని రవిశాస్త్రి అన్నాడు. 
 

27

ఐపీఎల్ లో అతడు రాణించినా.. టీ20 ఫార్మాట్ లో అతడిని ఇప్పుడే ఆడించడం తొందరపాటు చర్య అవుతుందని.. దానికి బదులు  ఇతర ఫార్మాట్లలో అతడిని ఆడించాలని సూచించాడు. 

37

ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ మాలిక్ ను ఇప్పుడే టీ20 లు ఆడించొద్దు.  టీ20 ప్రపంచకప్ కు కూడా అతడిని ఎంపికచేయొద్దు.  అతడిని ఎదగనివ్వండి. 

47

విదేశీ పర్యటనలలో జట్టుతో పాటు తీసుకెళ్లండి. ఒకవేళ  ఉమ్రాన్ ను తప్పనిసరిగా ఆడించాల్సి వస్తే 50 ఓవర్ల ఫార్మాట్ లోనో లేక రెడ్ బాల్ క్రికెట్ (టెస్టులు) లోనో ఆడించండి.  టెస్టులలో అతడిని ఎదగనివ్వండి. ఉమ్రాన్ గ్రోత్ ను చూడండి.. కానీ ఇప్పుడే టీ20 లు ఆడించొద్దు..’ అని అన్నాడు. 

57

ఐపీఎల్ లో 14 మ్యాచులాడి 22 వికెట్లు తీసిన ఈ స్పీడ్ స్టర్.. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల వేగం కంటే బౌలింగ్ చేయడంలో దిట్ట.  ఐపీఎల్ లో రాణించిన ఉమ్రాన్ ను  జాతీయ జట్టుకు ఎంపిక చేసినా ఇటీవలే ఢిల్లీలో ముగిసిన తొలి టీ20 లో మాత్రం అతడికి ఆడే అవకాశం కల్పించలేదు టీమ్ మేనేజ్మెంట్. 

67

కాగా  ఉమ్రాన్ ను జాతీయ జట్టులోకి తీసుకోవడంపై రెండ్రోజుల క్రితం భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

77

కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ మాలిక్ ను జాతీయ జట్టులోకి తీసుకోవడం నాకూ సంతోషమే. కానీ ఇంత త్వరగానా..? దేశవాళీ క్రికెట్  లో అతడిని మరో రెండు మూడేండ్లు ఆడించాల్సి ఉంటే బాగుండేది.  త్వరగా తీసుకుని అతడు సరిగా రాణించకుంటే మళ్లీ తిరిగి స్థానం దక్కించుకోవడం చాలా కష్టం..’అని తెలిపాడు. 

click me!

Recommended Stories