సౌంతిప్టన్‌లో అనుష్క శర్మ ఫోటో వైరల్... ఆమె వేసుకున్న చెప్పుల ధర తెలిస్తే...

First Published Jun 6, 2021, 12:26 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికలతో కలిసి ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే సౌంతిప్టన్‌లోని రోజ్ బౌల్‌కి చేరుకున్న విరాట్ సేన, అక్కడ మూడు రోజుల క్వారంటైన్‌ గడుపుతోంది.

క్రికెటర్లకు ఒకరితో ఒకరికి భౌతిక దూరం ఉండేలా క్వారంటైన్ ఏర్పాటు చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇప్పటికే క్వారంటైన్ మొదలెట్టిన భారత మహిళా, పురుషుల క్రికెటర్లు... స్టేడియం కనిపించేలా ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
undefined
ఓ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత పెద్దగా సోషల్ మీడియాలో కనిపించని అనుష్క శర్మ, సౌంతిప్టన్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘ఆఫీస్ పనిని ఇంటికి తీసుకురావడం కరెక్ట్ కాదు... అయితే ఈ రూల్ కొన్నిసార్లు విరాట్ కోహ్లీకి వర్తించదు...’ అంటూ కాప్షన్ పెట్టింది అనుష్క శర్మ...
undefined
ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న అనుష్క శర్మ, వైట్ కలర్ స్వెట్ షర్ట్, దానికి మ్యాచ్ అయ్యే జాగర్స్ ధరించింది. అయితే అందరి దృష్టి ఆమె వేసుకున్న చెప్పులపైనే పడింది. వైట్ కలర్ సాక్సులు వేసుకుని, గూచీ చెప్పులు వేసుకుంది అనుష్క శర్మ.
undefined
ఈ మధ్య సెలబ్రిటీలు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ చెప్పులు ధరించినా వాటి ధర ఎంత తెలుసుకోవడానికి గూగుల్ చేస్తున్న నెటిజన్లు... అనుష్క శర్మ చెప్పుల ధర కూడా ఆన్‌లైన్‌లో తెగ శోధించి కనిపెట్టేశారు. సౌంతిప్టన్‌లో దిగిన ఫోటోలో అనుష్క ధరించిన చెప్పుల ధర 436 డాలర్లు అంటే అక్షరాల 31,892 రూపాయలు...
undefined
చెప్పుల ధర దాదాపు 32 వేలు ఉంటే, ఇక ఆ స్వెట్ షర్ట్ ధర ఎంత ఉండొచ్చని గూగుల్ చేస్తే... దాని వెల చూసి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎంతో సింపుల్‌గా కనిపించే ఆ గూచీ స్వెట్ షర్ట్ ఖరీదు అక్షరాల 1,02,040 రూపాయలు...
undefined
ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ ఏటా రూ.600 కోట్లకు పైగా సంపాదిస్తుంటే, అనుష్క శర్మ బాలీవుడ్‌లో చేసే ఒక్కో సినిమాకి రూ.10 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటోంది.
undefined
తమ కూతురు వామిక కోహ్లీని సోషల్ మీడియాకి దూరంగా పెంచుతామని చెప్పిన విరాట్ కోహ్లీ, విమానాశ్రయంలో అనుష్క శర్మ ఎత్తుకున్న పాప ఫోటోలు దించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించిన ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
undefined
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌లోనే 42 రోజుల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేస్తారు విరాట్ కోహ్లీ అండ్ టీమ్. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ మొదలవుతుంది.
undefined
ఇది సెప్టెంబర్ 14న ముగిసిన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం యూఏఈ వెళ్తారు భారత క్రికెటర్లు. అక్కడే టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొని, నవంబర్‌లో స్వదేశానికి తిరిగి వస్తారు.
undefined
click me!