ఇండియా, పాకిస్తాన్ మధ్యే ఆసియా కప్ 2023 ఫైనల్... టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్స్..

Published : Jul 20, 2023, 08:52 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 టోర్నీ జరగనుంది. పాకిస్తాన్‌లో 4 మ్యాచులు, శ్రీలంకతో 9 మ్యాచులు జరగబోతున్నాయి. ఆగస్టు 30న మొదలయ్యే ఆసియా కప్, సెప్టెంబర్ 17న ముగియనుంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే ఆసియా క్రీడలు మొదలవుతాయి..

PREV
15
ఇండియా, పాకిస్తాన్ మధ్యే ఆసియా కప్ 2023 ఫైనల్... టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్స్..


గ్రూప్ Aలో ఉన్న ఇండియా, పాకిస్తాన్, సెప్టెంబర్ 2న కెండీలో మ్యాచ్ ఆడబోతున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 10న ఈ రెండు జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగవచ్చు. గ్రూప్ Aలో ఉన్న నేపాల్, తొలిసారి ఆసియా కప్ ఆడుతోంది. కాబట్టి నేపాల్, ఇండియా- పాకిస్తాన్‌లపై గెలవాలంటే సంచలనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది..

25

సూపర్ 4 రౌండ్‌లో టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 17న ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ మధ్యకాలంలో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాయి... 2022 టీ20 ఆసియా కప్‌ ఫైనల్ పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగింది..

35

‘ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. పాకిస్తాన్‌తో మూడు మ్యాచులు ఆడాలంటే ఫైనల్‌కి అర్హత సాధించాలి. ఒక్కో మ్యాచ్‌పై ఫోకస్ పెడుతూ వెళ్లాలి. నా దగ్గరున్న కోళ్లను మళ్లీ మళ్లీ లెక్కబెడుతూ పెట్టబోయే గుడ్ల గురించి ఆలోచించడం నాకు నచ్చదు. ఒక్కసారి ఒక్క మ్యాచ్‌పైనే దృష్టి పెడతాం..

45

పాకిస్తాన్‌తో, నేపాల్‌తో ఆడబోయే మొదటి రెండు గ్రూప్ మ్యాచుల గురించి ఆలోచిస్తున్నాం. ఆ రెండు మ్యాచుల్లో బాగా ఆడితే సూపర్ 4 రౌండ్‌కి వెళతాం. ఆ తర్వాత అక్కడి మ్యాచుల్లో బాగా ఆడితే ఫైనల్ ఆడతాం.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని మూడోసారి చూడాలంటే టీమిండియా అద్భుతంగా ఆడాలి..

55

ఇండియా - పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరిగితే చూడాలని ఉంది. దానికి టీమిండియాతో పాటు పాకిస్తాన్ టీమ్ కూడా బాగా ఆడి ఫైనల్‌కి రావాలి. పాకిస్తాన్ టీమ్ పటిష్టంగా ఉంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచులు జరుగుతాయని ఆశిస్తున్నాం..’ అంటూ బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. 

click me!

Recommended Stories