నా వల్ల కాదు, హర్భజన్ కొట్టిన సిక్సర్ వల్లే ఆ మ్యాచ్ గెలిచాం... మరోసారి ధోనీని ట్రోల్ చేసిన గంభీర్

First Published Sep 4, 2023, 4:23 PM IST

2011 వన్డే వరల్డ్ కప్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన హెలికాఫ్టర్ సిక్స్ గురించి కచ్ఛితంగా ఏదో ఒక కామెంట్ చేస్తాడు గౌతమ్ గంభీర్. మాహీ కొట్టిన సిక్స్ వల్ల యువరాజ్ సింగ్‌కి, సచిన్ టెండూల్కర్‌కి వరల్డ్ కప్ విజయంలో క్రెడిట్ దక్కలేదని చాలాసార్లు చెప్పాడు..

తాజాగా ఆసియా కప్ 2023 టోర్నీ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీని పరోక్షంగా ట్రోల్ చేశాడు గౌతమ్ గంభీర్. ఆసియా కప్ 2010 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ జరిగిన మ్యాచ్‌‌లో భారత జట్టు ఆఖరి ఓవర్‌లో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది...
 

ఈ మ్యాచ్2లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 267 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సల్మాన్ భట్ 74 పరుగులు చేయగా కమ్రాన్ అక్మల్ 51 పరుగులు, షోయబ్ మాలిక్ 39 పరుగులు, షాహిద్ ఆఫ్రిదీ 32 పరుగులు చేశారు... భారత బౌలర్లలో ప్రవీణ్ కుమార్ 3 వికెట్లు తీయగా జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు..

Latest Videos


ఈ లక్ష్యఛేదనలో సెహ్వాగ్ 10, విరాట్ కోహ్లీ 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు. గౌతమ్ గంభీర్ 83, మహేంద్ర సింగ్ ధోనీ 56 పరుగులు చేసి మూడో వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యం జోడించారు. సురేష్ రైనా 32, రోహిత్ శర్మ 22 పరుగులు చేయగా ఆఖర్లో హర్భజన్ సింగ్ 11 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. 

47 ఓవర్‌లో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు హర్భజన్ సింగ్. ఈ సమయంలో భజ్జీ, అక్తర్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. టీమిండియా విజయానికి 2 బంతుల్లో 3 పరుగులు కావాల్సి ఉండగా మహ్మద్ ఆమీర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించాడు హర్భజన్ సింగ్. 

gambhir dhoni

‘ఆ మ్యాచ్‌లో నేను గెలిపించలేదు. హర్భజన్ సింగ్ గెలిపించాడు. నేను, ధోనీ మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యం నెలకొల్పాం. కానీ ఆఖర్లో ఎవరైనా విజయానికి కావాల్సిన పరుగులు చేస్తారో వాళ్లే మ్యాచ్ గెలిపించినట్టు... ఆఖర్లో సిక్సర్ కొట్టిన వాళ్లకే ఆ క్రెడిట్ దక్కాలి..’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్..

Gambhir Dhoni

గంభీర్ చేసిన కామెంట్లు, 2011 వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ధోనీ కొట్టిన సిక్సర్ గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయిన ధోనీ, ఫైనల్ మ్యాచ్‌లో 91 పరుగులు చేసి వరల్డ్ కప్ క్రెడిట్ మొత్తం కొట్టేశాడని గౌతమ్ గంభీర్ పరోక్షంగా ఎత్తి పొడుస్తూ ఈ విధంగా కామెంట్ చేశాడు.. 

click me!