విరాట్ కోహ్లీ ఎప్పుడూ టీమ్‌లో తనే బెస్ట్ బౌలర్‌నని అనుకుంటాడు! మాకు అదే భయం.. - భువనేశ్వర్ కుమార్

Published : Aug 22, 2023, 12:40 PM IST

వన్డే వరల్డ్ కప్ 2019 వరకూ జస్ప్రిత్ బుమ్రాతో కలిసి టీమిండియాకి ప్రధాన పేసర్‌గా ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. అయితే గాయాలు, పేలవ ప్రదర్శన కారణంగా టీమ్‌లో చోటు కోల్పోయిన భువీ... బుమ్రా గాయపడడంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడాడు...  

PREV
16
విరాట్ కోహ్లీ ఎప్పుడూ టీమ్‌లో తనే బెస్ట్ బౌలర్‌నని అనుకుంటాడు! మాకు అదే భయం.. - భువనేశ్వర్ కుమార్
Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయిన భువనేశ్వర్ కుమార్... 2022 నవంబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు... ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో భువీకి చోటు దక్కలేదు.. 

26
Image credit: PTI

ఇక తనకు భారత జట్టులో చోటు దక్కడం అనుమానమేనని గ్రహించిన భువనేశ్వర్ కుమార్, కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాలో తన బయోలో ఉన్న క్రికెటర్‌ అనే పదాన్ని తొలగించాడు. టీమిండియా తరుపున అత్యధిక డాట్ బాల్స్ వేసిన రికార్డు సొంతం చేసుకున్న భువీ... తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నాడు..

36
Bhuvneshwar Kumar

‘విరాట్ కోహ్లీ ఎప్పుడూ టీమ్‌లో ఉన్న బౌలర్లలో తన బెస్ట్ బౌలర్‌ని అనుకుంటాడు. అతను బౌలింగ్ చేసిన ప్రతీసారి మేమంతా భయపడిపోతూ ఉంటాం. ఎందుకంటే అతని బౌలింగ్ యాక్షన్ అంత వింతగా ఉంటుంది. అలాంటి బౌలింగ్ యాక్షన్‌తో ఎక్కడ కిందపడి గాయపడతాడోనని కంగారుపడతాం..’ అంటూ కామెంట్ చేశాడు భువనేశ్వర్ కుమార్..

46
Bhuvneshwar Kumar

2012లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచులు ఆడాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత భువీకి పెద్దగా అవకాశాలు రాలేదు...

56

అదీకాకుండా మునుపటి వేడితో బౌలింగ్ చేయలేకపోతున్న భువనేశ్వర్ కుమార్, ఫిట్‌నెస్ సమస్యలతో ఐపీఎల్‌లోనూ అన్ని మ్యాచులు ఆడలేకపోతున్నాడు.. ఇన్‌స్టాలో క్రికెటర్ అనే పదాన్ని తొలగించడంతో భువీ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..

66
Image credit: Getty

ఒకనొక దశలో టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్‌ లిస్టులో గ్రేడ్ Aలో ఉన్న భువనేశ్వర్ కుమార్, 2022-23 ఏడాదికి బీసీసీఐ ప్రకటించిన లిస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. భువనేశ్వర్ కుమార్‌తో పాటు అజింకా రహానే, ఇషాంత్ శర్మలను కాంట్రాక్ట్ నుంచి తప్పించింది బీసీసీఐ.. 

Read more Photos on
click me!

Recommended Stories