మా ఇంట్లో కుక్క పేరు ‘ఓరియో’... ! ఎంఎస్ ధోనీకి వీడియోతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన గౌతమ్ గంభీర్...

First Published Sep 27, 2022, 6:03 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు మెంటర్‌గా ధోనీని ప్రకటించడంతో వచ్చిన హడావుడి అంతా ఇంతా కాదు. మహేంద్రుడు మాయాజాలంతో భారత జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుందని మాజీ క్రికెటర్లు బ్యాటు మీద శపథం చేసి మరీ చెప్పారు. అయితే మొదటి రెండు మ్యాచుల్లో భారత జట్టు చిత్తుగా ఓడడంతో మాహీ, ఆయన ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు...

తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ‘బిస్కెట్’ ప్రమోషన్‌... మాహీపై బీభత్సమైన ట్రోలింగ్ రావడానికి కారణమైంది...  ఫేస్‌బుక్ లైవ్‌లో మాహీ ఏదో చెబుతాడని అనుకుంటే ఓరియో ప్రమోషన్‌తో పెద్ద ‘బిస్కెట్’ వేశాడు..

ప్రమోషన్ చేయడమే ఓవర్ అనుకుంటే... ‘‘2011లో ఇండియాలో ఓరియో లాంఛ్ అయ్యింది, అదే ఏడాది టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది...’’ అంటూ ‘ఓరియో’ బిస్కెట్ కుక్కీస్ ప్రమోషన్ ఈవెంట్‌లో పదే పదే చెప్పాడు మహేంద్ర సింగ్ ధోనీ. మాహీ చూపించిన ఈ అత్యుత్సాహామే ఇప్పుడు అతనిపై ట్రోలింగ్ రావడానికి కారణమైంది...

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో 97 పరుగులు చేసి  టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ హెలికాఫ్టర్ సిక్సర్‌తో మాహీ ఆ క్రెడిట్ మొత్తం కొట్టేశాడని తెగ ఫీలైపోయే గౌతమ్ గంభీర్... ధోనీ చేసిన ఈ ‘బిస్కెట్’ ప్రమోషన్‌పై ఓ రేంజ్‌లో రియాక్ట్ అయ్యాడు...

మాహీ ఓరియో ప్రమోషన్ చేసిన కొన్ని గంటలకే తన కుటుంబం పెంపుడు కుక్కలతో కలిసి ఆడుకుంటున్న ఓ  వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు గౌతమ్ గంభీర్. ఇందులో తన ఓ పెంపుడు కుక్క పేరు ‘ఓరియో’... గౌతీ కూతురితో పాటు గంభీర్ కూడా చాలా సార్లు ఆ కుక్కను...‘ఓరియో... ఓరియో’ అంటూ పిలిచారు...

గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో కుటుంబానికి సంబంధించిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ పెద్దగా పంచుకోడు. అలాంటి గౌతమ్ గంభీర్ ఇప్పుడు సడెన్‌గా పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న వీడియో షేర్ చేశాడంటే... దానికి కారణం తన డాగ్ పేరు ‘ఓరియో’ అని చెప్పి... మాహీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే! అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...

మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే రోజున, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన వార్షికోత్సవం రోజున తన మట్టికొట్టుకుపోయిన ఫైనల్ మ్యాచ్ జెర్సీని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు గౌతమ్ గంభీర్. అలాంటి గంభీర్‌కి మాహీ ఇలా అడ్డంగా దొరికిపోవడం మాత్రం చాలా అరుదు... 

click me!