గౌతమ్ గంభీర్ అద్భుతమైన కెప్టెన్, అయితే... అతని వల్లే నాకు అవకాశాలు దూరం... కేసీ కరియప్ప...

First Published May 27, 2021, 1:37 PM IST

గౌతమ్ గంభీర్... 2007, 2011 వరల్డ్‌కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్. భారత జట్టుకి ఎన్నో విజయాలను అందించిన గౌతీ, చాలామందికి రోల్ మోడల్. ఆర్‌సీబీ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ కూడా తన రోల్‌మోడల్‌ గౌతమ్ గంభీర్ అంటూ ప్రకటించాడు. తాజాగా ఈ లిస్టులో మరో ప్లేయర్ చేరాడు.

2015 ఐపీఎల్ వేలంలో కర్ణాటక బౌలర్ కేసీ కరియప్పను రూ.2 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. కేకేఆర్ ట్రైయినింగ్ క్యాంపులో గంభీర్‌ను తన బౌలింగ్‌తో ఇంప్రెస్ చేసిన కరియప్ప, జాక్వస్ కలీస్‌ను కూడా మెప్పించాడు.
undefined
‘గౌతమ్ గంభీర్ చాలా అద్భుతమైన కెప్టెన్. అతను క్రీజులో చాలా స్టిక్‌. ఫీల్డింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ తప్పులు చేస్తే ఏ మాత్రం సహించడు. క్రీజులో ఉన్నప్పుడు నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ ఇవ్వాలని గౌతీ కోరుకుంటాడు.
undefined
అయితే క్రీజు బయట మనమేం చేసినా అస్సలు పట్టించుకోడు. క్రికెట్ కాకుండా మిగిలిన విషయాల్లో ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛని ఇస్తాడు. గౌతమ్ గంభీర్‌లో నాకు బాగా నచ్చింది ఇదే.
undefined
ఐపీఎల్‌లో నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. 2015 ఐపీఎల్ వేలం తర్వాత నా పేరు బాగా వినిపించింది, అయితే భారీ ధర దక్కించుకున్నా, నేను ఆడిన మ్యాచులు మాత్రం చాలా తక్కువ.
undefined
మొదటి మ్యాచ్‌లో ఏబీ డివిల్లియర్స్‌ను అవుట్ చేశాడు. నా ఐపీఎల్ మొదటి వికెట్ ఏబీడీయే. కానీ సునీల్ నరైన్ ఎంట్రీతో జట్టులో నా ప్లేస్ మిస్ అయ్యింది. నరైన్‌ను కొనసాగించడంతో నాకు ఎక్కువగా అవకాశాలు రాలేదు.
undefined
ఏ ప్లేయర్‌కి అయితే మ్యాచులు ఎక్కువ ఆడితే, నమ్మకం పెరుగుతుంది. అది పర్ఫామెన్స్‌లో కనిపిస్తుంది. నాకు ఇప్పటికీ నేను ఆడిన మొదటి మ్యాచ్ గుర్తుంది.
undefined
దాదాపు లక్ష మంది ప్రజల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడడం ఓ కలలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అనుభూతిని మళ్లీ అనుభవించడానికైనా నాకు అవకాశాలు రావాలని కోరుకునేవాడిని...’ అంటూ చెప్పుకొచ్చాడు కరియప్ప.
undefined
2015లో కేకేఆర్ తరుపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన కరియప్ప, 2016 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడాడు. తిరిగి 2019లో కేకేఆర్‌లోకి వచ్చిన కరియప్ప... ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు.
undefined
‘గౌతమ్ గంభీర్‌తో పోలిస్తే సంజూ శాంసన్ చాలా కామ్ పర్సన్. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడడు. చాలా మృదు స్వభావి. అండర్ 19 ఆడినప్పుడు, సంజూ శాంసన్ కూడా కేరళ తరుపున ఆడాడు.
undefined
ఆటగాళ్లపై సంజూ శాంసన్ బాగా నమ్మకం పెడతాడు. బెన్ స్టోక్స్ ఎప్పుడూ ఫుల్ జోష్‌లో ఉంటాడు. మేం తింటున్నప్పుడు మా దగ్గరికి వచ్చి కబుర్లు చెబుతూ ఉంటాడు. బట్లర్ చాలా తక్కువ మాట్లాడతారు కానీ ఎక్కువగా నవ్వుతాడు.
undefined
ఎప్పుడూ నవ్వుతూ ఉండే బట్లర్‌ను చూస్తే ఏదో పాజిటివిటీ నిండుతుంది. శ్రేయాస్ గోపాల్ ఫ్రాంక్స్ చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. మిల్లర్, రాహుల్ తెవాటియాతో నాకు చక్కని స్నేహం కుదిరింది’ అంటూ చెప్పుకొచ్చాడు కరియప్ప.
undefined
click me!