2007 వరల్డ్ కప్‌కి ఎందుకు సెలక్ట్ చేయలేదో తెలీదు! 2015 వరల్డ్ కప్‌లో ఎందుకు లేనో అర్థం కాదు.. - గౌతమ్ గంభీర్

First Published Aug 25, 2023, 12:16 PM IST

2003లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన గౌతమ్ గంభీర్, తన 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఆడింది ఒకే ఒక్క వన్డే వరల్డ్ కప్ టోర్నీ. 2007 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన గంభీర్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీ రోల్ పోషించాడు..
 

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 54 బంతుల్లో 75  పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన గౌతమ్ గంభీర్, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి... టీమిండియా విజయంలో కీ రోల్ పోషించాడు. అయితే ఆ తర్వాత జరిగిన 2015 వన్డే వరల్డ్ కప్‌లోనూ గౌతమ్ గంభీర్‌కి చోటు దక్కలేదు..

2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లోని వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, మునాఫ్ పటేల్, జహీర్ ఖాన్ లేకుండానే 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడింది భారత జట్టు. దీనికి కారణం ధోనీ, సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాలే..

Latest Videos


‘నా వరకూ వరల్డ్ కప్ ఫైనల్ ఆడడం నాకెప్పుడూ ఒత్తిడిగా అనిపించలేదు. నాకు పరుగులు ఎలా చేయాలో తెలుసు. నాకు నచ్చిన పనిని నమ్మకంగా చేస్తున్నానని ఆడేవాడిని. 2 వికెట్లు పడిన తర్వాత కూడా నాలో ఎలాంటి నెగిటివ్ ఆలోచన రాలేదు..

నా ఫోకస్ అంతా తర్వాతి బాల్ ఎలా ఆడాలనే దానిపైనే ఉండేది. తర్వాతి బాల్ గురించి కాకుండా మ్యాచ్ గురించి, చేయాల్సిన పరుగుల గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. నా ఆట పూర్తిగా నా కంట్రోల్‌లోనే ఉండేది. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అలాగే ఆడాను..
 

నా కెరీర్‌లో 2011 వన్డే వరల్డ్ కప్ విజయం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నేను 2007 వన్డే వరల్డ్ కప్‌‌లో ఆడలేకపోయాను. ఆ టోర్నీకి నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు ఇప్పటికీ తెలీదు. అప్పటికి నేను బాగానే ఆడుతున్నా కానీ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాను..

2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా 2015 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో నాకు చోటు దక్కలేదు. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచాం. కానీ అది మాకు అంత కిక్కు ఇవ్వలేదు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ గెలవాలనేదే మా అందరి కల..

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ ఇలా కోర్ టీమ్ ప్లేయర్లు అంతా కలిసి కట్టుగా ఆడి 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. 28 ఏళ్ల తర్వాత వచ్చిన ఆ విజయం చాలా చాలా సంతృప్తినిచ్చింది...
 

ఫైనల్‌లో నేను 50 ఓవర్లు ఫీల్డింగ్ చేశా. ఆ తర్వాత 42 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశా. అంటే 92 ఓవర్లు ఫైనల్ మ్యాచ్‌లో క్రీజులో ఉన్నా. ఎవ్వరూ అంత సేపు ఉండలేకపోయారు. క్రీజులో ఉన్నంతసేపు ఇంకా పరుగెత్తాలి, ఇంకా పరుగులు తీయాలనే ఉండేది..

అవుటై డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన తర్వాత కళ్లు తిరిగినట్టు అనిపించింది. పూర్తిగా అలిసిపోయా. ఆ రోజు తెల్లవారుజాము దాకా సెలబ్రేట్ చేసుకున్నాం. నా రూమ్‌కి వెళ్లగానే ఆనందం తట్టుకోలేక ఏడ్చేశా.

 ఆ తర్వాత రోజు ఇంటికి వెళ్లా. అది నా కుటుంబానికి చాలా గర్వకారణమైన రోజు.. మా అమ్మను అంత సంతోషంగా చూడడం అదే తొలిసారి.. నా జీవితంలో మరిచిపోలేని క్షణాలవి...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్.. 

click me!