అన్న లేక సుఖాలు ఎక్కువయ్యాయి... రీఎంట్రీ ఇస్తున్న గౌతమ్ గంభీర్...

First Published Aug 19, 2022, 4:02 PM IST

గౌతమ్ గంభీర్... టీమిండియాకి ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్. 2011 వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో గౌతీ చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్, భారత జట్టుకి ఎంతో కీలకం.  2007 టీ20 వరల్డ్ కప్ విజయంలోనూ కీలక భూమిక పోషించిన గౌతీ, క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు...

ఢిల్లీలో బీజేపీ ఎంపీగా గెలిచిన గౌతమ్ గంభీర్, ఐపీఎల్‌ ప్రిడిక్షన్స్ ద్వారా నెగిటివ్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. గౌతీ ఎవరు గెలుస్తారని అంటే, వాళ్లు కచ్ఛితంగా ఓడిపోతారనే ట్రోలింగ్ సోషల్ మీడియాలో బీభత్సంగా జరిగింది...

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ విన్నింగ్ క్రెడిట్ మహేంద్ర సింగ్ ధోనీ కొట్టేశాడని, అతను ఒక్క సిక్సర్ కొట్టడం వల్లే ప్రపంచ కప్ గెలవలేదని చాలాసార్లు బహిరంగంగానే మాజీ కెప్టెన్‌ని విమర్శించాడు గౌతమ్ గంభీర్...

Gautam Gambhir

ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో లక్నో సూపర్ జెయింట్స్‌కి మెంటర్‌గా వ్యవహరించాడు గౌతమ్ గంభీర్. గౌతీ మెంటర్‌షిప్‌లో కొత్త జట్టు లక్నో ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతుల్లో ఓడింది లక్నో సూపర్ జెయింట్స్...

ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌ని తినేసేలా కోపంగా చూడడం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది... ఈ సంఘటన తర్వాత రాహుల్ గాయం కారణంగా ఏకంగా రెండు నెలలు క్రికెట్‌కి దూరమయ్యాడు..

గౌతమ్ గంభీర్ మరోసారి క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఇండియన్ మహారాజాస్ తరుపున ఆడేందుకు గంభీర్ సంసిద్ధంగా ఉన్నట్టు తెలియచేశాడు...

2016 తర్వాత గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. రంజీ ట్రోఫీ, దేశవాళీ టోర్నీలు ఆడిన తర్వాత క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత గౌతమ్ గంభీర్ ఆడే చూసే అవకాశం క్రికెట్ ఫ్యాన్స్‌కి దక్కనుంది...

టీమిండియా తరుపున 37 టీ20 మ్యాచులు ఆడిన గౌతమ్ గంభీర్, 932 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గంభీర్ రీఎంట్రీ కన్ఫార్మ్ కావడంతో ‘అన్న లేక సుఖాలు ఎక్కువయ్యాయి... అన్నొస్తున్నాడు...’ అంటూ కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. 

click me!