బాక్సింగ్ డే టెస్టుకి భారత జట్టును ప్రకటించిన గౌతమ్ గంభీర్... ఏకంగా ఐదు మార్పులతో...

First Published Dec 22, 2020, 4:10 PM IST

మొదటి టెస్టు మ్యాచ్‌లో ఊహించని పరాజయంతో కుదేలైన టీమిండియా, బాక్సింగ్ డే టెస్టు కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆసీస్ టూర్‌ను వరుసగా రెండు పరాజయాలతో ఆరంభించిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచింది. ఆఖరి టీ20తో పాటు మొదటి టెస్టు ఓడడంతో మళ్లీ విజయాల బాట పట్టాలని డిసైడ్ అయిన భారత జట్టుకి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.

తొలి టెస్టులో ఆడిన ప్లేయర్లలో విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేయడం, మహ్మద్ షమీ గాయంతో తప్పుకోవడంతో వీరిద్దరితో పాటు మరో ముగ్గురు ప్లేయర్లతో రెండో టెస్టులో చోటు ఉండకూడదని తెలిపాడు గౌతమ్ గంభీర్...
undefined
మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టులో ఈ 11 మంది ఉంటే, మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని తెలుపుతూ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు గౌతీ.
undefined
పృథ్వీషాకి నో ఛాన్స్... మొదటి టెస్టులో విఫలమైన యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషాకి రెండో టెస్టు తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు గౌతమ్ గంభీర్.
undefined
పృథ్వీషా స్థానంలో యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని సలహా ఇచ్చాడు గౌతమ్ గంభీర్... మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాలని తెలిపాడు.
undefined
‘నిజానికి పృథ్వీషాకి అనుభవం ఎక్కువ. శుబ్‌మన్ గిల్ ఇప్పటిదాకా ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తే పృథ్వీషాలో కాన్ఫిడెన్స్ లోపించినట్టు స్పష్టంగా తెలుస్తోంది...
undefined
ఆత్మవిశ్వాసం లేని పృథ్వీషా కంటే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్‌కి అవకాశం ఇవ్వడం చాలా బెటర్...’ అన్నాడు గౌతమ్ గంభీర్..
undefined
మూడో స్థానంలో టెస్టు స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పూజారా బరిలో దిగాలని చెప్పిన గంభీర్, నాలుగో స్థానంలో రహానే బ్యాటింగ్‌కి వచ్చి జట్టును ముందుండి నడిపించాలని సలహా ఇచ్చాడు.
undefined
కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన కెఎల్ రాహుల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానంలో ఆడించడం ఉత్తమమని చెప్పిన గంభీర్... సాహా ప్లేస్‌లో రిషబ్ పంత్‌ను ఆడించాలని చెప్పాడు.
undefined
‘వృద్ధిమాన్ సాహా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్టు అనిపించడం లేదు. జట్టుకు అవసరమైన పరుగులు చేయలేకపోతున్నాడు సాహా. అందుకు రిషబ్ పంత్‌కి అవకాశం ఇవ్వాలి...’ అని చెప్పాడు గంభీర్.
undefined
హనుమ విహారి స్థానంలో రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకొస్తే... బ్యాటింగ్, బౌలింగ్‌ రెండు రకాలుగా ఉపయోగపడతాడని చెప్పిన గంభీర్... అశ్విన్‌, జడేజా జోడి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలదని చెప్పాడు.
undefined
సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌తో పాటు బుమ్రాను కూడా తుది జట్టులో తప్పకుండా చేర్చాలని చెప్పిన గంభీర్... గాయపడిన షమీ స్థానంలో నవ్‌దీప్ సైనీ లేదా మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం ఇవ్వాలని చెప్పాడు.
undefined
మొత్తంగా గంభీర్ ప్రకటించిన రెండో టెస్టు జట్టు ఇలా ఉంది: అజింకా రహానే (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, నవ్‌దీప్ సైనీ లేదా మహ్మద్ సిరాజ్.
undefined
click me!