అజింకా రహానేకి సీక్రెట్ కోడింగ్ సలహా ఇచ్చిన వసీం జాఫర్... ఆ ఇద్దరినీ తీసుకొమ్మంటూ...

First Published Dec 22, 2020, 1:33 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. మీమీ మేకర్స్‌‌ కంటే మహా చురుగ్గా వ్యవహారించే వసీం జాఫర్... ట్విట్టర్‌లో తన వ్యంగ్యాన్ని మొత్తం చూపిస్తుంటారు. క్రికెట్‌పై వసీం జాఫర్ వేసే ట్వీట్లకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. టీమిండియా ఓటమిపై కూడా కవితతో ఫన్నీగా కామెంట్ చేసినా జాఫర్... రెండో టెస్టుకి ముందు రహానేకి ఓ కోడింగ్ సలహా ఇచ్చాడు.

‘డియర్ అజింకా రహానే.. నీకోసం ఓ రహస్య మెసేజ్ ఇందులో దాగి ఉంది. గుడ్ లక్ ఫర్ బాక్సింగ్ డే’ అంటూ ట్వీట్ చేశాడు వసీం జాఫర్...
undefined
‘People In Cricket Know Grief In Life Lingers Aplenty Never Dabble Rise And Handcraft Unique Legacy’ అంటూ ఓ కోడ్‌ మెసేజ్‌ను ట్వీట్ చేశాడు జాఫర్...
undefined
‘ఈ మెసేజ్‌ను ఎవ్వరైనా సరే డీ కోడ్ చేసి అజింకా రహానేకి చెప్పవచ్చని నెటిజన్లకు సూచించాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...
undefined
చాలామంది నెటిజన్లు వసీం జాఫర్ ఇచ్చిన కోడ్‌ను డీ కోడ్ చేశారు. జాఫర్ ఇచ్చిన మెసేజ్‌లో మొదటి అక్షరాలను తీసుకుంటే.. ‘PICK GILL AND RAHUL’ అని వస్తుంది.
undefined
మొదటి టెస్టులో పృథ్వీషా ఘోరంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 పరుగులే చేసిన పృథ్వీషా, ఫీల్డింగ్‌లోనూ క్యాచులు జారవిడిచాడు...
undefined
పృథ్వీషా బ్యాటింగ్ లోపాన్ని అర్థం చేసుకున్న ఆసీస్ బౌలర్లు, ఈజీగా అతన్ని అవుట్ చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్, రెండో ఇన్నింగ్స్‌లో కమ్మిన్స్ 4 బంతులలోపే పృథ్వీషాను పెవిలియన్ చేర్చారు.
undefined
పృథ్వీషా కంటే మెరుగైన టెక్నిక్‌తో ప్రాక్టీసు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన శుబ్‌మన్ గిల్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
undefined
అలాగే మొదటి టెస్టు అనంతరం స్వదేశానికి పయనమైన విరాట్ కోహ్లీ స్థానంలో కెఎల్ రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది...
undefined
దే సందేశాన్ని అజింకా రహానేకి ఇచ్చాడు వసీం జాఫర్... ఫన్నీ ట్వీట్లు, మీమీలతో అభిమానులను అలరించే వసీం జాఫర్‌కి 92వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు...
undefined
దేశవాళీ క్రికెట్‌లో అత్యధిక మ్యాచులు, అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన వసీం జాఫర్.. ట్వీట్లలో తన హస్యచతురతను, వ్యంగ్యాన్ని కలుపుతూ అందర్నీ నవ్విస్తుంటాడు.
undefined
click me!