‘గబ్బా’ టెస్టు: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... కీలక బౌలర్లు లేకుండా బరిలో భారత్...

Published : Jan 15, 2021, 05:32 AM IST

గాయాలతో జట్టుకి దూరమైన బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, విహారి... జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మయాంక్ అగర్వాల్.. నటరాజన్, వాష్టింగన్ సుందర్ టెస్టు ఎంట్రీ... రీఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్... అనుభవం లేని బౌలింగ్‌ యూనిట్‌తో ఆడుతున్న భారత జట్టు...

PREV
113
‘గబ్బా’ టెస్టు:  టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... కీలక బౌలర్లు లేకుండా బరిలో భారత్...

టెస్టు సిరీస్ ఫలితంగా నిర్ణయించే నాలుగో టెస్టు మ్యాచ్‌లోనూ ఆతిథ్య ఆస్ట్రేలియాకే అదృష్టం వరించింది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

213

నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతున్న ‘గబ్బా’ స్టేడియంలో ఆస్ట్రేలియా అద్భుతమైన రికార్డు ఉంది. గత 30 ఏళ్లల్లో ఆస్ట్రేలియా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

313

మరోవైపు భారత జట్టు నాలుగో టెస్టులో కీలకమైన బౌలర్లు లేకుండా బరిలో దిగుతోంది.

413

మూడో టెస్టులో గాయపడిన బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, జడేజా, విహారి జట్టుకు దూరమయ్యారు. 

513

వారి స్థానంలో శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. 

613

నటరాజన్, సుందర్‌లకు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కాగా, శార్దూల్ ఠాకూర్ ఇంతకుముందు ఓ టెస్టు ఆడి 10 బంతులు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత గాయంతో టెస్టుకు దూరమయ్యాడు. 

713

నేటి మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు బౌలర్లలో రెండో టెస్టులో ఆరంగ్రేటం చేసిన సిరాజ్‌కు రెండు టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అదే అత్యధిక అనుభవం. 

813

మూడో టెస్టులో ఆరంగ్రేటం చేసిన నవ్‌దీప్ సైనీ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు.. శార్దూల్ ఠాకూర్‌కి ఓ టెస్లు అనుభవం ఉన్నా, అది 10 బంతులకు సంబంధించింది మాత్రమే.

913

ఇంత తక్కువ అనుభవం ఉన్న బౌలర్లలో భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడడం గత 50 ఏళ్లల్లో ఇదే తొలిసారి.

1013

స్టీవ్ స్మిత్, లబుషేన్, వార్నర్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్ వంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఉన్న ఆస్ట్రేలియాను ఏ మాత్రం అనుభవం లేని భారత యంగ్ బౌలర్లు ఎంతమేరకు కట్టడి చేయగలరనేది ఆసక్తికరంగా మారింది.

1113

మరోవైపు ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో ఒక మార్పు చేసింది. గాయం కారణంగా యంగ్ ఓపెనర్ పుకోవిస్కీ, నాలుగో టెస్టుకి దూరమయ్యాడు. అతని స్థానంలో మార్కస్ హార్రీస్ జట్టులోకి వచ్చాడు. 

1213

భారత జట్టు:
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దప్ సైనీ, మహ్మద్ సిరాజ్, నటరాజన్

1313

ఆస్ట్రేలియా జట్టు:
డేవిడ్ వార్నర్, మార్కస్ హార్రీస్, లబుషేన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పైన్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హజల్‌వుడ్

click me!

Recommended Stories