వరల్డ్ కప్‌కు నేరుగా ఎందుకు అర్హత సాధించలేదో విచారించండి.. కమిటీ వేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు

Published : Apr 13, 2023, 05:32 PM IST

దసున్ శనక సారథ్యం వహిస్తున్న శ్రీలంక వన్డే టీమ్ లో  టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నా ఆ జట్టు ఇలా డీలాపడిపోవడం   టీమ్ మేనేజ్మెంట్ తో  పాటు  ఆ దేశ క్రికెట్ అభిమానులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నది.  

PREV
16
వరల్డ్ కప్‌కు నేరుగా ఎందుకు అర్హత సాధించలేదో  విచారించండి.. కమిటీ వేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు
Image credit: PTI

ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే  వన్డే వరల్డ్ కప్  లో  నేరుగా ఆడే అవకాశం కోల్పోయింది శ్రీలంక. ఇటీవలే  న్యూజిలాండ్  తో  వన్డే సిరీస్ లో  ఓడిపోవడంతో  ఆ జట్టు  జూన్ నుంచి జింబాబ్వే వేదికగా జరుగబోయే  క్వాలిఫికేషన్ రౌండ్ ఆడి అందులో క్వాలిఫై అవుతేనే  వరల్డ్ కప్ ఆడే అవకాశాలుంటాయి. 

26
sri lanka

ఈ నేపథ్యంలో  శ్రీలంక  క్రీడా మంత్రి రోషన్  రణసింఘె  లంక బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.   లంక వన్డే వరల్డ్ కప్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచీ ఆ జట్టు క్వాలిఫై  రౌండ్  లో పాల్గొనడం ఇదే ప్రథమం. 1996లో  వన్డే వరల్డ్ కప్ గెలిచి, 2011 లో ఫైనల్ వరకూ వెళ్లిన లంక ఇలా దయనీయ స్థితిలో ఉండటంతో దేశ మాజీలు  బోర్డుతో పాటు జట్టు పైనా దుమ్మెత్తిపోశారు.  

36

తాజాగా  రణసింఘె..   అసలు లంక  ఓటములకు కారణాలు ఏంటి..?  వన్డే వరల్డ్ కప్ కోసం నేరుగా  ఎందుకు క్వాలిఫై కాలేకపోయింది..? వంటి అంశాలపై విచారణ చేయాలని   నాలుగు సభ్యులతో కూడిన ఓ కమిటీని వేశారు. ఈ కమిటీకి  లంక మాజీ సారథి, 1996 వన్డే వరల్డ్ కప్ లో  ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా  నిలిచిన   సనత్ జయసూర్య  నాయకత్వం వహిస్తున్నాడు. 

46

ఈ కమిటీ లంక టీమ్ మేనేజ్మెంట్, కోచింగ్ సిబ్బంది, ఇతరులను విచారించి  వరల్డ్ కప్ లో  క్వాలిఫై కాలేకపోవడానికి కారణాలేంటి..? అని విశ్లేషించి  నివేదికను క్రీడా మంత్రిత్వ  శాఖకు అందించనున్నది.  అంతేగాక  జింబాబ్వేలో జరుగబోయే  క్వాలిఫై  రౌండ్ లో కూడా బాగా ఆడేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేయనున్నది.   

56

దసున్ శనక సారథ్యం వహిస్తున్న వన్డే టీమ్ లో  టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నా ఆ జట్టు ఇలా డీలాపడిపోవడం   టీమ్ మేనేజ్మెంట్ తో  పాటు  ఆ దేశ క్రికెట్ అభిమానులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నది.  ఈ నేపథ్యంలో ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ కల్పించి  వారిని వరల్డ్ కప్ కోసం సిద్ధం చేసే దిశగా జయసూర్య నేతృత్వంలోని కమిటీ పని చేయనున్నది.  
 

66

కాగా  జూన్ నుంచి జరుగబోయే  వరల్డ్ కప్ క్వాలిఫికేషన్  గ్రూప్ లో  శ్రీలంకతో పాటు వెస్టిండీస్, జింబాబ్వే పోటీ పడనున్నాయి. ఇవే గాక  సౌతాఫ్రికా లేదా ఐర్లాండ్ లలో ఏదైనా ఒక టీమ్  పాల్గొనే అవకాశాలుంటాయి. ఇటీవలే సఫారీలు.. నెదర్లాండ్స్ ను ఓడించి  కీలక పాయింట్లు సాధించి వరల్డ్ కప్ సూపర్ లీగ్  టేబుల్ లో 8వ స్థానానికి ఎగబాకారు. మే నెలలో ఐర్లాండ్ - బంగ్లాదేశ్ ల మధ్య  జరిగే మూడు వన్డే సిరీస్ లో  ఐర్లాండ్ గనక  క్లీన్ స్వీప్ చేస్తే అప్పుడు సౌతాఫ్రికాకు కష్టాలు తప్పవు.  

click me!

Recommended Stories