ఓటమి బాధలో ఉన్న చెన్నైకి మరో షాక్.. ఆ పేసర్‌కు కూడా గాయం.. ఇక కష్టమే..!

Published : Apr 13, 2023, 04:48 PM IST

IPL 2023: ఐపీఎల్ లో  చెన్నై సూపర్ కింగ్స్  కు వరుస షాకులు తాకుతున్నాయి. గాయాలు ఆ జట్టును పట్టి పీడిస్తున్నాయి.  తాజాగా  మరో పేసర్ కూడా గాయపడ్డాడు.

PREV
16
ఓటమి బాధలో ఉన్న చెన్నైకి మరో షాక్..  ఆ పేసర్‌కు కూడా గాయం.. ఇక కష్టమే..!

బుధవారం రాజస్తాన్ రాయల్స్ తో హోంగ్రౌండ్ లో   3 పరుగుల తేడాతో ఓడిన  చెన్నై సూపర్ కింగ్స్  కు  మరో భారీ షాక్ తగిలింది.   ఆ జట్టు  కీలక పేసర్, ప్రస్తుతం ఉన్న  బౌలర్లలో  కాస్తో కూస్తో అంతర్జాతీయ అనుభవం ఉన్న   దక్షిణాఫ్రికా  బౌలర్ సిసంద మగల  కూడా గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ జట్టుకు  హెడ్ కోచ్ గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్  చెప్పాడు. 
 

26
Sisanda Magala

సీఎస్కే - రాజస్తాన్ మ్యాచ్ తర్వాత  ఫ్లెమింగ్ చెన్నై గాయాల బాధితుల గురించి  మాట్లాడుతూ.. ‘దీపక్ చాహర్  రెండు మూడు వారాలు ఆడటం కుదరదు.  బెన్ స్టోక్స్ కూడా ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాడు.    ముఖేశ్ చౌదరి ఆల్రెడీ దూరమయ్యాడు.  మగల కూడా  కనీసం రెండు వారాలు ఆడేది అనుమానమే..’ అని  చెప్పాడు. 

36
Image credit: PTI

రాజస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా ఆకాశ్ సింగ్ వేసిన ఓవర్లో అశ్విన్ భారీ షాట్ ఆడగా  మిడాఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న   మగల  క్యాచ్ అందుకున్నాడు. కానీ ఈ క్రమంలో బంతి అతడి చేతికి బలంగా తాకింది.  దీంతో అతడు మ్యాచ్ లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాల్సి వచ్చింది.   

46

ముఖేశ్ చౌదరి ప్లేస్ లో వచ్చిన మగల కూడా   రెండు వారాల పాటు ఐపీఎల్ కు దూరంగా ఉండటం  చెన్నైకి ఇబ్బందికర పరిస్థితే.   ఇప్పటికే ఆ జట్టు దీపక్ చాహర్ సేవలను కోల్పోయింది.  ముంబైతో మ్యాచ్ లో  చాహర్ ఒక్క ఓవర్ వేసి తొడ కండరాలు పట్టేడయంతో  ఆ తర్వాత పెవిలియన్ కు చేరాడు. అతడు నాలుగైదు మ్యాచ్ లు ఆడేది అనుమానంగానే ఉంది. 

56
Tushar Deshpande

ఇక తాజాగా మగల కూడా దూరం కావడంతో  చెన్నై  పూర్తిగా కొత్త బౌలర్ల మీదే ఆధారపడాల్సి ఉంటుంది.  లంక పేసర్ మతీశ పతిరన తో పాటు ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రాజ్యవర్ధన్ హంగర్గేకర్ వంటి   వర్ధమాన  పేసర్ల  తోనే   సీఎస్కే ఆడాల్సి ఉంటుంది.  

66

రాజస్తాన్ తో మ్యాచ్ తర్వాత చెన్నై.. ఈ నెల 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడాల్సి ఉంది.   21న  సన్ రైజర్స్ హైదరాబాద్, 23 న కోల్కతాతో  ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ లకు  దీపక్ చాహర్, మగల   లేకుండానే ఆడనుంది. మరి ఈ మ్యాచ్ ల వరకైనా  బెన్  స్టోక్స్ కోలుకుంటాడా..? అనేది అనుమానమే.. 

click me!

Recommended Stories