India Vs South Africa: ఇటీవలికాలంలో విదేశాలలో భారత జట్టు ప్రదర్శన బాగుందని, అయితే అందులో ముగ్గురు సీమర్లది కీలక పాత్ర అని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
కొద్దికాలంగా విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా టెస్టు క్రికెట్ లో అద్భుత విజయాలు సాధిస్తూ అగ్రదేశాలకూ షాకిస్తున్నది. ఆస్ట్రేలియాలో ఆసీస్ ను ఓడించి సిరీస్ నెగ్గడమే గాక ఆర్నెళ్ల క్రితం ఇంగ్లాండ్ కు వెళ్లి అక్కడ రూట్ సేనను బోల్తా కొట్టించింది. అర్థాంతరంగా ముగిసిన ఆ సిరీస్ లో కూడా భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
28
ఇక తాజాగా దక్షిణాఫ్రికా పేస్ పిచ్ లపై సఫారీలను రఫ్ఫాడించింది. వారి స్వంత గడ్డపై మన సీమర్లు అదరగొట్టే ప్రదర్శన చేశారు. ఈ పిచ్ లపై పూర్తి అవగాహన ఉన్న ప్రొటీస్ జట్టును ఇటీవలే ముగిసిన సెంచూరియన్ టెస్టులో చిత్తుచిత్తుగా ఓడించారు.
38
అయితే ప్రస్తుత టీమిండియాను చూస్తే 90లలో ప్రపంచ క్రికెట్ ను శాసించిన పాకిస్థాన్ జట్టు గుర్తుకు వస్తుందని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది భారత జట్టుకు మంచిదేనని ప్రశంసించాడు.
48
మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘గడిచిన 5-6 ఏండ్లలో భారత జట్టులో ఎవరూ ఊహించని మార్పు వచ్చింది. విదేశాలలో భారత విజయాల రేటు గణనీయంగా పెరిగింది.
58
దీనికి ముఖ్య కారణం నిస్సందేహంగా మన పేస్ త్రయమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనకున్న ముగ్గురు ప్రపంచ స్థాయి సీమర్లు విదేశాలపై అనుకున్నదానికంటే ఎక్కువ ప్రభావం చూపుతున్నారు.
68
ఒకసారి మీరు టెస్టు క్రికెట్ చరిత్రను తిరగేస్తే.. 90లలో పాకిస్థాన్ జట్టు విదేశాలకు వెళ్లి ప్రత్యర్థులను గడగడలాడించేది. అప్పుడు ఆ జట్టుకు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయభ్ అక్తర్ రూపంలో అద్భుతమైన పేస్ త్రయం ఉండేది.
78
ఇప్పుడు భారత జట్టును చూస్తే అలాగే అనిపిస్తున్నది. మనకు కూడా బుమ్రా, షమీ, సిరాజ్ ల రూపంలో ముగ్గురు సీమర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఏదేమైనా ఇది భారత జట్టుకు శుభ పరిణామం...’ అని అన్నాడు.
88
సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో భారత జట్టు దక్షిణాఫ్రికాను రెండు సార్లు ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. 20 వికెట్లలో సిరాజ్, బుమ్రా, షమీల వాటా 16 వికెట్లు కావడం గమనార్హం.