శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో అతన్ని ఆడిస్తే బెటర్... టీమిండియాకి గౌతమ్ గంభీర్ సలహా...

Published : Jan 03, 2022, 12:41 PM IST

సౌతాఫ్రికా టూర్‌లో సెంచూరియన్ టెస్టు గెలిచి, శుభారంభం చేసిన భారత జట్టు... జోహన్‌బర్గ్‌లో మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవాలని తహతహలాడుతోంది. రెండో టెస్టు ఆరంభానికి ముందు జట్టులో కొన్ని మార్పులు చేయాల్సిందిగా సూచించాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..

PREV
113
శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో అతన్ని ఆడిస్తే బెటర్... టీమిండియాకి గౌతమ్ గంభీర్ సలహా...

‘టీమిండియా మొదటి రోజు ఆట చూసిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఈజీగా 400+ స్కోరు చేస్తారని అనుకున్నా. కానీ మిడిల్ ఆర్డర్‌ నుంచి రావాల్సినన్ని పరుగులు రాలేదు..

213

అయితే బౌలింగ్ అటాక్ కారణంగా సెంచూరియన్ టెస్టులో టీమిండియా కమ్‌బ్యాక్ ఇవ్వగలిగింది. లేదంటే రెండో ఇన్నింగ్స్‌లో మనోళ్ల బ్యాటింగ్ కారణంగా మ్యాచ్ ఫలితమే మారిపోయి ఉండేది...

313

స్కోరు బోర్డు కారణంగా ఏ క్రికెటర్‌ సమర్థుడని నిర్ణయించడం కరెక్ట్ కాదు. సెంచూరియన్ టెస్టులో సౌతాఫ్రికా జట్టు ఆఖరి రోజు కూడా విజయం కోసం పోరాడిందనే చెప్పాలి...

413

ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టులో బ్యాటింగ్ లైనప్ సరిగా లేదు. అనుభవం ఉన్న బ్యాట్స్‌మెన్ కొరత వారిని వేధిస్తోంది. టెస్టు క్రికెట్‌లో స్వింగ్ బౌలర్లకు టాప్ క్లాస్ స్కిల్స్ అవసరం...

513

సౌతాఫ్రికాలో అలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు, అయితే బ్యాట్స్‌మెన్‌కి ఇంకా అనుభవం రావాలి. అయితే వండరర్స్ గ్రౌండ్‌ ఫాస్ట్ బౌలర్లకు బాగా సహకరిస్తుంది. జోహన్‌బర్గ్‌లో భారత జట్టుకి మంచి రికార్డు ఉంది...

613

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ పరుగులు చేయడం అంత తేలికైన విషయమేమీ కాదు. పేస్‌తో పాటు బౌన్సర్లతో సఫారీ బౌలర్లు, భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది...

713

కాబట్టి భారత జట్టు కూడా బౌలింగ్ విభాగంలో కొన్ని మార్పులు చేస్తే బెటర్. హనుమ విహారి లేదా శ్రేయాస్ అయ్యర్‌లకి అవకాశం ఇస్తే, బ్యాటింగ్ ఆర్డర్‌లో మరిన్ని పరుగులు వచ్చేందుకు ఆస్కారం పెరుగుతుంది...

813

అయితే సీనియర్లను పక్కనబెట్టి ఈ ఇద్దరిని ఆడించే సాహసం టీమిండియా చేయకపోవచ్చు. అయితే శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కి అవకాశం ఇస్తే మంచిదని నా అభిప్రాయం...

913

ఎందుకంటే ఉమేశ్ యాదవ్ వేగం, బౌన్సర్లు భారత జట్టుకి జోహన్‌బర్గ్‌లో వికెట్లు తెచ్చిపెడతాయి. విరాట్ కోహ్లీ ఈ మార్పు గురించి ఆలోచిస్తాడనే అనుకుంటున్నా...

1013

మొదటి మ్యాచ్‌లో అజింకా రహానేకి తుదిజట్టులో ప్లేస్ ఉంటుందని నేనైతే ఊహించలేదు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో అతను చేసిన 48 పరుగులు, రెండో టెస్టులోనూ రహానేకి చోటు దక్కించి పెట్టవచ్చు...

1113

ఫామ్‌లో లేకపోయినా ఛతేశ్వర్ పూజారా, మూడో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ అవుటైన విధానం గురించి చాలా చర్చ జరిగింది. అయితే అదంతా అనవసరం...

1213

టీమిండియాకి విరాట్ కోహ్లీ ఓ రన్ మెషిన్. అతను మరింత సమయం క్రీజులో కుదురుకోవడానికి కేటాయిస్తే సరిపోతుందని నా అభిప్రాయం...’ అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్...

1313

తొలి టెస్టులో ఆల్‌రౌండర్‌గా చోటు దక్కించుకున్న శార్దూల్ ఠాకూర్, బ్యాటుతో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.

click me!

Recommended Stories