19 ఏళ్ల పురుష క్రికెటర్‌పై అత్యాచారం, వేధింపులు... ఆస్ట్రేలియా జట్టులో కలకలం...

First Published Jan 3, 2022, 11:06 AM IST

ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి సెక్స్ కుంభకోణం కలకలం రేపుతోంది. దాదాపు 37 ఏళ్ల కిందట జరిగిన సంఘటన గురించి, తాజాగా పోలీసులను ఆశ్రయించడం, ఈ విషయం వెలుగులోకి వచ్చింది...

1985లో భారత్‌, శ్రీలంక దేశాల్లో పర్యటించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో 19 ఏళ్ల అండర్‌-19 క్రికెటర్ జమీ మిచెల్‌కి కూడా చోటు దక్కింది...

ఆ పర్యటనలో ఓ ఆస్ట్రేలియా టీమ్ అధికారి, తనను రేప్ చేశాడని, ఆ తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశాడు జమీ మిచెల్...

‘జెమీ మిచెల్, తనకు జరిగిన దారుణ అనుభవాన్ని ఇప్పటికైనా బయటపెట్టినందుకు అతన్ని అభినందించాల్సిందే. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం...’ అంటూ తెలిపింది ఆస్ట్రేలియా గవర్నింగ్ బాడీ...

1985లో శ్రీలంక పర్యటనలో ఉన్న సమయంలో కొలంబోలో టూర్ ముగించుకునే ఆఖరి రోజున తనపై అత్యాచారం జరిగినట్టు తన ఫిర్యాదులో వెల్లడించాడు జమీ మిచెల్...

మిచెల్‌పై లైంగిక దాడికి చేసిన అధికారి ఎవరనేదాని వివరాలను మాత్రం పోలీసులు బయటపెట్టలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా మిచెల్‌కి పూర్తి సపోర్ట్ చేస్తామని ప్రకటించింది...

‘నా క్రికెట్ జీవితంలో అదే మచ్చ. ఆ భయానక సంఘటన నుంచి కోలుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది. నేను క్రికెట్‌గా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడానికి కూడా ఇదే కారణం...’ అంటూ కామెంట్ చేశాడు జమీ మిచెల్..

మిచెల్‌పై లైంగిక దాడి జరిగిందని చెబుతున్న సమయంలో మాజీ ఆసీస్ కెప్టెన్ గ్రేగ్ చాపెల్, ఆసీస్ టీమ్ సెలక్టర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో ఇలాంటి సంఘటన తన దృష్టిలో రాలేదని చెప్పాడు గ్రేగ్ చాపెల్...

‘క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయాన్ని మానవీయ కోణంలో పరిష్కరించాలి. సంస్థ పరువు కాపాడాలని ప్రయత్నాలు చేయకూడదు. అలాంటిదేమీ జరిగి ఉండకూడదని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు గ్రేగ్ చాపెల్... 

click me!