నిజంగా గెలవాలనే ఆడారా? ఆ ఫీల్డింగ్ ఏంటి?... టీమిండియాపై మహ్మద్ కైఫ్ కామెంట్...

Published : Jun 14, 2023, 09:46 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ముగిసి మూడు రోజులు కావస్తున్నా మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, భారత జట్టు ఫీల్డింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు..  

PREV
19
నిజంగా గెలవాలనే ఆడారా? ఆ ఫీల్డింగ్ ఏంటి?... టీమిండియాపై మహ్మద్ కైఫ్ కామెంట్...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగుల భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ కలిసి 285 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఇదే..

29
Virat Kohli

తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగుల వద్ద అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో ఛేతశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ జారవిడిచారు...

39

‘టీమిండియా, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడిన విధానం నాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే గెలవాలనే పట్టుదలతో వాళ్లు ఆడినట్టు, ఆడుతున్నట్టు నాకు అస్సలు అనిపించలేదు...
 

49

స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేసేవాళ్లకు సమన్వయం చాలా అవసరం. ఎవరు క్యాచ్ అందుకోవాలనే విషయంలో ముందుగానే ఓ నిర్ణయం తీసుకోవాలి. టీమిండియా ఫీల్డింగ్ చాలా బద్ధకంగా కనిపించింది..

59

స్లిప్‌లో ఉండే ఫీల్డర్లు ప్రతీ సెకన్ చాలా అప్రమత్తంగా ఉండాలి, కానీ మన ఫీల్డర్లు తమ దగ్గరికి క్యాచ్ రాదని ఫిక్స్ అయిపోయి రిలాక్స్ అయిపోయినట్టు కనిపించింది. ఇంకా చెప్పాలంటే మనవాళ్లు సరిగ్గా వంగడానికి కూడా చేతకానట్టు ఫీల్డింగ్ చేశారు..

69

విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ని స్టీవ్ స్మిత్ ఎలా డైవ్ చేస్తూ అందుకున్నాడో అందరూ చూశారు. మ్యాచ్ గెలవాలంటే అలాంటి క్యాచులు పట్టాలి. సగం సగం ఛాన్సులను కూడా వదిలేయకూడదు. అప్పుడే ప్రత్యర్థిపై పైచేయి సాధించవచ్చు..

79

తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ కొట్టిన షాట్, విరాట్ కోహ్లీకి కాస్త ముందు పడింది. దాని కోసం విరాట్ గట్టిగా ప్రయత్నించి ఉంటే వికెట్ దొరికి ఉండేది. అప్పటికి ఆస్ట్రేలియా 190 కూడా దాటలేదు. స్మిత్ వికెట్ పడి ఉంటే మ్యాచ్ మరోలా ఉండి ఉండేది..
 

89

విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు, భారత జట్టులో చాలామంది ఫీల్డర్లు ఇలాగే ఆడడం ఇష్టలేనట్టుగానే కనిపించారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో స్టంప్‌కి 25 గజాల దూరంలో స్లిప్ ఫీల్డర్లు ఉంటారు. ఆసియాలో చాలా దగ్గరగా ఉంటారు..

99

క్యాచులు పట్టుకోవడానికి ఎక్కడ నిలబడితే బెటర్ అనే విషయాన్ని మనవాళ్లు గ్రహించలేకపోయారు. కనీసం ఆస్ట్రేలియా ఫీల్డర్లను చూసి కూడా నేర్చుకోవాలని ప్రయత్నించలేదు. నా వరకూ టీమిండియా ఓటమికి చెత్త ఫీల్డింగ్ కూడా ఓ కారణం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. 

click me!

Recommended Stories