WTC Final 2023: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పించడంపై మాజీ సారథి సునీల్ గవాస్కర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రెండ్రోజుల క్రితం ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై సునీల్ గవాస్కర్ మరోసారి తీవ్రంగా స్పందించాడు. ఇది అతడిని అవనమానించడమేనని అన్నాడు.
26
మిడ్ డే కు రాసిన వ్యాసంలో గవాస్కర్... ‘ఈ మధ్యకాలంలో ఏ టాప్ క్లాస్ ఇండియన్ క్రికెటర్ కు కూడా ఇంత అవమానం జరుగలేదు. ఇదే అశ్విన్ ప్లేస్ లో ఎవరైనా వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ ఉండి ఉంటే అతడు కొద్దిరోజులుగా సరిగా ఆడటం లేదనో లేక డ్రై స్పిన్ పిచ్ లపై ఆడడనో.. బౌన్సీ పిచ్ పై పరుగులు తీయడం చేతకాదనే కారణంతో పక్కనబెడతారా..? అస్సలు అలా చేయరు.
36
అశ్విన్ ను తుది జట్టు నుంచి తప్పించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ వివరణ ఇచ్చినా దాని వల్ల ఉపయోగం లేదు. భారత బౌలింగ్ తీరు చూడండి. ఎంత దారుణంగా ఉందో.. టీమిండియా టెస్టులలో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ ను బెంచ్ మీద కూర్చోబెట్టింది.
46
Image credit: Getty
ఆస్ట్రేలియా జట్టులో ఐదుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారు. ఇందులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ ఏకంగా సెంచరీ సాధించాడు. మరో లెఫ్ట్ హ్యాండర్ అలెక్స్ కేరీ తొలి ఇన్నింగ్స్ లో 48, రెండో ఇన్నింగ్స్ లతో 66 పరుగులు చేశాడు. అశ్విన్ ఉండుంటే కచ్చితంగా వీళ్ల స్కోర్లు ఇలా ఉండేవి కావు.
56
ఒకదశలో 130 లోపే ఐదు వికెట్లు పడ్డా భారత బౌలర్లు ఆ అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఒకవేళ అశ్విన్ ఉంటే ఏదైనా జరిగే అవకాశముండేది. అశ్విన్ బ్యాట్ తో కూడా రాణించేవాడు...’ అని రాసుకొచ్చాడు.
66
భారత బ్యాటర్ల షాట్ సెలక్షన్ పై కూడా గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. రెండు ఇన్నింగ్స్ లలోనూ భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లీల షాట్ సెలక్షన్ చాలా చెత్తగా ఉందని విమర్శించాడు.