చీఫ్ సెలక్టర్‌గా మాజీ ఆల్‌రౌండర్లు... అజిత్ అగార్కర్‌కి కీలక బాధ్యతలు అప్పగించనున్న బీసీసీఐ...

First Published Nov 16, 2020, 1:38 PM IST

గత కొన్నాళ్లుగా భారత జట్టు ఎంపికపై తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు బీసీసీఐ సెలక్టర్లు. వన్డే వరల్డ్‌కప్‌కి అంబటి రాయుడిని ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదం  కాగా, ఎంతో అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్లను పక్కనబెట్టి, వరుసగా విఫలం అవుతున్న పంత్, జాదవ్ లాంటి ప్లేయర్లను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. ఈ సారి సెలక్షన్ కమిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది బీసీసీఐ.

గట్టిగా 10 టెస్టు మ్యాచులు ఆడిన అనుభవం లేని మాజీ క్రికెటర్లు, సెలక్టర్లుగా కొనసాగుతూ తమకు నచ్చినట్టుగా జట్టును ఎంపిక చేస్తున్నారని అనేక విమర్శలు వచ్చాయి...
undefined
దీంతో బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీలో సమూల మార్పులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఇప్పటికే సెలక్టర్ల ఎంపికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన బీసీసీఐ, దరఖాస్తుల ప్రక్రియను ముగించింది.
undefined
ఐదుగురు సభ్యులుండే చీఫ్ సెలక్షన్ కమిటీలో సౌత్ జోన్‌ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో కర్ణాటకకు చెందిన సునీల్ జోషి ఎంపికయ్యాడు...
undefined
సెంట్రల్ జోన్ నుంచి గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్‌ను నియమించింది సీఏసీ.. మిగిలిన ముగ్గురు సభ్యుల్లో మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ కూడా దాదాపు ఖరారైనట్టు సమాచారం.
undefined
మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిలీ... అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి, వారిని ఇంటర్వ్యూ చేసింది...
undefined
మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మహిందర్ సింగ్, ఎస్‌ఎస్‌ దాస్‌లు సెలక్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ముగ్గురిని ఎంపిక చేయడం ఖాయం.
undefined
భారతజట్టు తరుపున వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అజిత్ అగార్కర్. 21బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న అజిత్ అగార్కర్.... జింబాబ్వేతో జరిగిన వన్డేలో 39 బంతుల్లో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
undefined
26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడిన అజిత్ అగార్కర్... మొత్తంగా 350 వికెట్లు తీయడమే కాకుండా టెస్టుల్లో ఓ సెంచరీ కూడా చేశాడు.
undefined
మరో సెలక్టర్‌గా ఎంపికైన చేతన్ శర్మ 23 టెస్టులు, 65 వన్డేలు ఆడాడు. వన్డేల్లో ఓ సెంచరీ చేసిన చేతన్ శర్మ, తన కెరీర్‌లో 148 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత బౌలర్ చేతన్ శర్మ.
undefined
చీఫ్ సెలక్టర్‌గా ఎంపికైన సునీల్ జోషి తన క్రికెట్ కెరీర్‌లో 15 టెస్టులు, 69 వన్డేలు ఆడి 110 వికెట్లు పడగొట్టాడు, రెండు హాఫ్ సెంచరీలు కూడా బాదాడు...
undefined
మాజీ సెలక్షన్ కమిటీకి పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదనే విమర్శలు రావడంతో ఈసారి అనుభవం ఉన్న మాజీ క్రికెటర్లను సెలక్టర్లుగా తీసుకున్న బీసీసీఐ, ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యం ఇచ్చింది.
undefined
వివిధ సిరీస్‌లకు భారత క్రికెట్ జట్టుతో పాటు జాతీయ స్థాయిలో ఆడే భారత్ ఏ, దులీప్ ట్రోఫీ, దేవ్‌ధర్ ట్రోఫీ, ఛాలెంజర్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా వంటి జట్లకు క్రికెటర్లను ఎంపిక చేశారు భారత క్రికెట్ కమిటీ సెలక్టర్లు.
undefined
click me!