డెలివరీ బాయ్‌గా మారిన క్రికెటర్, ఒలింపిక్ ఛాంపియన్... క్రీడా ప్రపంచంపై కరోనా ఎఫెక్ట్...

First Published Nov 16, 2020, 12:30 PM IST

కంటికి కనిపించని కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలన్నా అల్లాడిపోయాయి. ధనిక- బీద, కులం-మతం, వర్ణం- ప్రాంతం, భాష- భావం... ఇలా మనిషి ఏర్పారచుకున్న బేధాలను పట్టించుకోకుండా కోట్ల మంది ప్రజల ప్రాణాలు బలితీసుకుంది కరోనా మహమ్మారి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలతో పాటు క్రీడా రంగాలపై కూడా కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది.

కరోనా వైరస్ కారణంగా మార్చి నెల చివరలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్, ఆరు నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది...
undefined
ఎట్టకేలకు బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ఛాలెంజింగ్ తీసుకుని, దేశానికి దూరంగా యూఏఈలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచులను నిర్వహించాల్సి వచ్చింది...
undefined
ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ కూడా కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా వేశారు. ఇది క్రికెటర్లపై, క్రీడాకారులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది...
undefined
రూబెన్ లిమర్డో ఎనిమిదేళ్ల క్రితం ఒలింపిక్ టైటిల్ గెలిచాడు. 1904 నుంచి లాటిక్ అమెరికా తరుపున కూబా రోమన్ ఫోన్ట్స్ చేసిన మొట్టమొదటి ఫెన్సర్ కూడా రూబెన్ లిమర్డోనే.
undefined
వెనిజులా నుంచి గోల్డ్ మెడల్ సాధించిన రెండో ప్లేయర్ కూడా రూబెన్ లిమర్డోనే... అయితే కరోనా విపత్తు అతని జీవితాన్నే మార్చేసింది.
undefined
కరోనా సంక్షోభం పొట్టకూటి కోసం ఉబర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా మారాడు రూబెన్. 35 ఏళ్ల రూబెన్ ఈ ఏడాది ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకున్నాడు.. కానీ కరనా వల్ల అది సాధ్యం కాలేదు.
undefined
వచ్చే ఏడాది ఒలింపిక్స్ కోసం అతనికి వెనిజులా ప్రభుత్వం నుంచి కొంత మొత్తం వస్తోంది. కరోనా ప్రభావంతో క్రీడాకారులకు చెల్లించే పారితోషికంలో కూడా కోత పడింది. దీంతో డెలివరీ బాయ్‌గా మారాడు రూబెన్.
undefined
అలాగే నెదర్లాండ్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ కూడా కరోనా విపత్తులో జీవనం కొనసాగించడానికి డెలివరీ బాయ్‌గా మారాడు...
undefined
ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్ కూడా పాల్గొనాల్సింది. అయితే కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు... దీంతో బతుకుతెరువు కోసం చలిచంపేసే శీతాకాలంలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానంటూ ట్వీట్ చేశాడు పాల్ వాన్.
undefined
click me!