ఆ మూడు టోర్నీల కంటే, ఇదే చాలా గొప్ప విజయం... గంభీర్ ట్వీట్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్...

First Published Aug 5, 2021, 3:44 PM IST

41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలిచింది భారత హాకీ జట్టు... జర్మనీతో జరిగిన బ్రౌంజ్ మెడల్ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం అందుకున్న టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే హాకీ విజయంపై గౌతమ్ గంభీర్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...

జర్మనీపై 5-4 తేడాతో విజయాన్ని అందుకున్న భారత పురుషుల హాకీ టీమ్‌ను ప్రశంసిస్తూ గౌతమ్ గంభీర్ వేసిన ట్వీట్ వివాదాస్పదమైంది... 

‘1983, 2007 లేదా 2011 వరల్డ్‌కప్‌లను మరిచిపోండి... హాకీలో మెడల్, ఏ వరల్డ్‌కప్‌ కంటే కూడా చాలా పెద్దది... ఇండియా హాకీ నా దేశ గౌరవం...’ అంటూ ట్వీట్ చేశాడు గౌతమ్ గంభీర్...

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం ఎవ్వరికైనా గర్వకారణమనే.  2008లో ఒలింపిక్స్‌కి కనీసం అర్హత సాధించలేకపోయిన టీమిండియా, 2012లో 12వ స్థానంలో, 2016లో 8వ స్థానంలో నిలిచింది...

2020లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత జట్టు, కాంస్య పతకంతో మెరగడం హాకీ చరిత్రలో గ్రేమ్ కమ్‌బ్యాక్‌గా చెప్పుకోవచ్చు. నాలుగు దశాబ్దాలుగా పెద్దగా పట్టించుకోని హాకీకి ఈ విజయం క్రేజ్‌ను తీసుకురావచ్చు...

హాకీ విజయాన్ని గొప్పదిగా పేర్కోవడం తప్పు లేదు కానీ క్రికెట్‌లో సాధించిన విజయాలను తక్కువ చేయడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేయాలని చూస్తే గంభీర్, ఈ విజయాన్ని కూడా అందుకు వినియోగించుకున్నాడని అంటున్నారు మాహీ ఫ్యాన్స్...

1983లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో వరల్డ్‌కప్ గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టు, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ సాధించింది. అయితే ఈ రెండు వరల్డ్‌కప్ విజయాల్లోనూ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు.

వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో సచిన్, సెహ్వాగ్ విఫలమైన చోట 97 పరుగులు చేసి ఆదుకున్న గౌతమ్ గంభీర్‌కి దక్కాల్సినంత క్రెడిట్ మాత్రం దక్కలేదు. కారణం ఆఖర్లో మాహీ కొట్టిన హెలికాఫ్టర్ షాట్...

దీంతో ఛాన్స్ దొరికినప్పుడల్లా తాను చేసినదాన్ని గుర్తు చేస్తూ, మాహీకి దక్కుతున్న క్రెడిట్‌ని తక్కువ చేయాలని ప్రయత్నించాడు గౌతీ. ధోనీ పుట్టినరోజున తన సోషల్ మీడియాలో 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో జెర్సీ పిక్‌ను పోస్టు చేశాడు కూడా...

హాకీ విజయాన్ని కూడా అందుకు వాడుకున్నాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఈ రెండు విజయాల్లో కీపర్స్ కీలక పాత్ర పోషించారనే విషయం గుర్తుంచుకోవాలంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ధోనీ ఫ్యాన్స్..

click me!