ఐదో టెస్టు రద్దు ఎఫెక్ట్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం... భారత జట్టుకి పీటర్సన్ మద్ధతు...

First Published Sep 10, 2021, 2:14 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు కావడంతో ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డుకి భారీ నష్టం చూకూరింది. ప్రసార హక్కులు, మ్యాచ్ టికెట్లు తదితర ఆదాయాల రూపంలో దాదాపు రూ.250 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది ఇంగ్లాండ్ బోర్డు...

భారత జట్టులో కరోనా కేసులు వెలుగుచూడడంతో శుక్రవారం ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరుజట్లు. ఐసీసీతో జరిపిన చర్చల తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతోనే కొనసాగించనున్నట్టు ప్రకటించాయి...

టెస్టు సిరీస్‌లో మిగిలిన ఐదో టెస్టు, వచ్చే ఏడాది భారత జట్టు, ఇంగ్లాండ్ పర్యటనలో ఆడనుంది. అప్పటిదాకా ఈ టెస్టు సిరీస్‌ పూర్తికానట్టే...

ఐదో టెస్టు రద్దు కావడం వల్ల భారీ నష్టం రావడంతో భారత క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు చేస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి...

అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ మాత్రం భారత జట్టుకు మద్ధతుగా నిలిచాడు... ‘గత ఏడాది ఇంగ్లాండ్ బోర్డు, కరోనా భయంతో సౌతాఫ్రికాతో ఆడాల్సిన టెస్టు సిరీస్‌ను రద్దు చేసుకుంది. అప్పుడు సౌతాఫ్రికా బోర్డుకి కలిగిన నష్టంతో పోలిస్తే, ఇది చాలా తక్కువ...’ అంటూ ట్వీట్ చేశాడు కేవిన్ పీటర్సన్...

దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులు కూడా ఈసీబీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అప్పుడు కరోనా భయంతో సిరీస్ రద్దు చేసుకునేటప్పుడు, సౌతాఫ్రికా క్రికెట్ ఎదుర్కొనే నష్టం గురించి ఆలోచించలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు...

click me!