Abhishek Sharma: సిక్సర్ల తుపాను.. కోహ్లీ, రోహిత్‌ల రికార్డులు బ్రేక్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ

Published : Oct 27, 2026, 04:00 PM IST

Abhishek Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన 3వ టీ20లో అభిషేక్ శర్మ 35 బంతుల్లో సెంచరీతో చెలరేగి కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో భారత్ అత్యంత వేగవంతమైన వంద, అత్యధిక పవర్‌ప్లే స్కోరుతో ప్రపంచ రికార్డులను నమోదు చేసింది.

PREV
15
కివీస్ బౌలర్లకు నరకం చూపించిన అభిషేక్ శర్మ.. 5 ఓవర్లలోనే 100 రన్స్ బాది టీమిండియా సంచలనం

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఊహించని రేంజ్‌లో స్టార్ట్ ఇచ్చారు.

తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షం చేసింది. కేవలం 35 బంతుల్లోనే అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేసుకుని, అత్యధిక టీ20 శతకాలు సాధించిన భారతీయుడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.

25
కోహ్లీ ఆల్-టైమ్ రికార్డు బ్రేక్

ఈ మ్యాచులో సాధించిన సెంచరీ అభిషేక్ శర్మకు ఓవరాల్ టీ20 కెరీర్‌లో 11వ సెంచరీ. దీని ద్వారా ఓవరాల్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా 10 సెంచరీలు ఉన్న విరాట్ కోహ్లీని అభిషేక్ దాటేశాడు. ప్రపంచ స్థాయిలో చూస్తే క్రిస్ గేల్ (22), బాబర్ ఆజమ్ (13) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.

అంతేకాకుండా, కేవలం 70 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే ఇది అభిషేక్‌కు 4వ సెంచరీ. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (చెరో 5 సెంచరీలు) తర్వాతి స్థానంలో నిలిచాడు.

35
పవర్‌ప్లేలోనే ప్రపంచ రికార్డు విధ్వంసం

భారత ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తింది. మొదటి ఓవర్లోనే 26 పరుగులు రాగా, పవర్‌ప్లే ముగిసేసరికి (6 ఓవర్లలో) భారత్ వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే పవర్‌ప్లేలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. గతంలో రొమేనియా (116/0) పేరిట ఉన్న రికార్డును భారత్ తిరగరాసింది. టెస్టు హోదా కలిగిన దేశాల్లో ఈ పవర్‌ప్లే స్కోరు ఒక సంచలనం.

45
5 ఓవర్లలోనే 100 పరుగులు.. హిస్టరీ క్రియేట్

అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదడంతో భారత్ 2.2 ఓవర్లలోనే జట్టు 50 పరుగుల మార్కును తాకింది. ప్రపంచంలోనే అతివేగవంతమైన టీ50 రికార్డును సమం చేసింది. ఆ తర్వాత మరింతగా విరుచుకుపడి కేవలం 5.0 ఓవర్లలోనే (30 బంతుల్లో) జట్టు స్కోరును 100 పరుగులకు చేర్చారు.

టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతివేగంగా 100 పరుగులు చేసిన ప్రపంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రొమేనియా (5.2 ఓవర్లు), సౌతాఫ్రికా (5.3 ఓవర్లు) రికార్డులను భారత్ దాటేసింది.

55
150 సిక్సర్లు, 2200 ప్లస్ రన్స్ మైలురాయి

ఈ సునామీ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 38 బంతుల్లో 113 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో 150 సిక్సర్ల మైలురాయిని కేవలం 69 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకని, రోహిత్ శర్మ (205), సూర్యకుమార్ యాదవ్ (179) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా నిలిచాడు.

దాంతోపాటు టీ20ఐల్లో 2200కి పైగా పరుగులు, 194 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories