ఆస్ట్రేలియా విషయంలో జరిగినట్టే జరిగితే... వరల్డ్ కప్‌ మనదే! టీమిండియా ఫ్యాన్స్‌లో కొత్త సెంటిమెంట్...

Published : Sep 07, 2022, 09:28 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత జట్టు ఫైనల్ ఆశలు దాదాపు ఆవిరి అయినట్టే. వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు, ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌పై గెలిచినా ఫైనల్ చేరడం కష్టమే. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 ముందు ఎదురైన ఈ పరాజయం, టీమిండియాకి మంచిదే అంటున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్...

PREV
18
ఆస్ట్రేలియా విషయంలో జరిగినట్టే జరిగితే...  వరల్డ్ కప్‌ మనదే! టీమిండియా ఫ్యాన్స్‌లో కొత్త సెంటిమెంట్...
rohit sharma

ఆసియా కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగింది భారత జట్టు. రోహిత్ సేన ఉన్న ఫామ్‌కి, టీమిండియాని ఓడించడం ఏ టీమ్ వల్ల కాదనుకున్నారు అభిమానులు. అయితే రెండు మ్యాచులకే సీన్ రివర్స్ అయ్యింది...

28

సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడిన టీమిండియా, ఫైనల్‌ రేసు నుంచి దూరమైంది. అయితే టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి ముందు ఎదురైన ఈ పరాభవం టీమిండియాకి మంచే చేస్తుందని అంటున్నారు కొందరు ఫ్యాన్స్...

38

aaron finch

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా కూడా ఇలాంటి పరాజయాలనే ఎదురైంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ చేతుల్లో టీ20 సిరీస్‌లను కోల్పోయిన ఆసీస్, ఏ మాత్రం అంచనాలు లేకుండా పొట్టి ప్రపంచకప్‌లో బరిలో దిగింది...

48
Kane Williamson and Aaron Finch

వార్మప్ మ్యాచుల్లోనూ ఓడిన ఆస్ట్రేలియా, అసలు మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ చూపించింది. అంచనాలకు మించి రాణించి సెమీస్ చేరిన ఆసీస్, పాకిస్తాన్‌ని ఓడించి ఫైనల్‌కి ప్రవేశించింది. న్యూజిలాండ్‌ని చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్‌ టైటిల్ కైవసం చేసుకుంది..

58

ఇప్పుడు ఆసియా కప్‌లో ఓడడంతో టీమిండియాపై అంచనాలు కాస్తో కూస్తో తగ్గుతాయి. మనోళ్లు మరోసారి హార్ట్‌బ్రేక్ ఇస్తారని ఫిక్స్ అయిపోతారు ఫ్యాన్స్. ఇది టీమ్‌పై కాస్త ప్రెషర్‌ని తగ్గిస్తుంది. అంచనాలు లేకుండా ఆడినప్పుడు స్వేచ్ఛగా ఆడడానికి అవకాశం ఉంటుంది...

68

వన్డే వరల్డ్ కప్ 2007లో ఘోర పరాభవం తర్వాత ఏ మాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్ కప్‌కి వెళ్లింది భారత జట్టు. అండర్‌ డాగ్స్‌గా టోర్నీలో అడుగుపెట్టి, టైటిల్ గెలిచి సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా దాన్ని రిపీట్ చేసేందుకు టీమిండియాకి అవకాశం దొరికిందని అంటున్నారు ఫ్యాన్స్...

78

ఆస్ట్రేలియా విషయంలో జరిగినట్టే టీమిండియా విషయంలో సెంటిమెంట్ వర్కవుట్ అయితే... ఆసీస్ గడ్డ మీద టీ20 వరల్డ్ కప్‌ మనదే అంటున్నారు అభిమానులు. అయితే ఓ విషయంలో మాత్రం ఆసీస్‌కి, ఇండియాకి తేడా ఉంది...

88

ఆసియా కప్‌లో భారత జట్టు ఓడినా జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని సరిపెట్టుకుంటున్నారు అభిమానులు. ఈ ఇద్దరూ రీ- ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారత జట్టుపై అంచనాలు మళ్లీ ఆకాశాన్ని తాకడం పక్కా... 

Read more Photos on
click me!

Recommended Stories