టాప్‌లో ముంబై, ఆఖరి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్... న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జోస్యం...

Published : Apr 04, 2021, 03:55 PM IST

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఆడిన 11 సీజన్లలో 10సార్లు ప్లేఆఫ్, 8 సార్లు ఫైనల్ చేరిన ఒకే ఒక్క జట్టు సీఎస్‌కే... అయితే గత సీజన్‌లో ఘోరమైన పర్ఫామెన్స్‌తో ఏడో స్థానంలో నిలిచింది. ఈసారి సీఎస్‌కే మరింత ఘోరమైన ప్రదర్శన ఇస్తుందని అంచనా వేస్తున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్...

PREV
111
టాప్‌లో ముంబై, ఆఖరి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్... న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జోస్యం...

ఐపీఎల్ 2021 సీజన్ సమీపిస్తున్న సందర్భంగా పాయింట్ల పట్టికలో ఏ జట్టు, ఏ స్థానంలో నిలుస్తుందో అంచనా వేస్తూ ఓ ట్వీట్ చేశాడు స్కాట్ స్టైరిస్. అయితే స్కాట్ అంచనా వేసిన టేబుల్‌లో సీఎస్‌కే అట్టడుగున ఉండడం హాట్ టాపిక్ అయ్యింది...

211

మిగిలిన జట్లతో పోలిస్తే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, సమర్థవంతులైన ఆల్‌రౌండర్లు, బీభత్సమైన బౌలర్లు ఉన్న ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు స్కాట్ స్టైరిస్...

311

గత సీజన్‌లో తొలిసారి ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ఈసారి శ్రేయాస్ అయ్యర్ లేకపోయినా రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తున్నాడు స్కాట్ స్టైరిస్...

411

ఐపీఎల్ 2021 వేలంలో డేవిడ్ మలాన్, జే రిచర్డ్‌సన్, రిలే మెడెరిత్, షారుక్ ఖాన్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన కారణంగా పంజాబ్ కింగ్స్... టాప్ 3 చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్...

511

గత సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స హైదరాబాద్, మరోసారి ప్లేఆఫ్ చేరుతుందని... అయితే నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంటుందని తేల్చాడు స్కాట్ స్టైరిస్...

611

గత సీజన్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈసారి ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించడం కష్టమేనని తేల్చిన స్కాట్, రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో ఉంటుందని అంచనా వేశాడు...

711

రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన క్రిస్ మోరిస్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉండడం, గాయంతో ఆర్చర్ దూరం కావడం వల్ల రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో నిలుస్తుందని చెప్పిన స్టైరిస్... ఆర్చర్ త్వరగా ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇస్తే రాయల్స్ పైకి ఎగబాకుతుందని చెప్పాడు..

811

సరైన బ్యాటింగ్ ఆర్డర్ లేని కారణంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు, ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలుస్తుందని చెప్పాడు స్కాట్ స్టైరిస్...

911

గత సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి ఆఖరి స్థానంలో నిలుస్తుందని తేల్చాడు. సరైన బ్యాట్స్‌మెన్, బౌలర్ లేకపోవడం చెన్నై బలహీనతని తేల్చాడు...

1011

స్కాట్ స్టైరిస్ ట్వీట్‌కి స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్... ఎల్లో జెర్సీలో ఉన్న అతని ఫోటోను ట్వీట్ చేసి.. ‘ఎక్స్ మచ్చి... వై మచ్చి’ అంటూ ట్వీట్ చేసింది...

1111

ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ మాత్రం ఈసారి రాజస్థాన్ రాయల్స్ కప్పు గెలవబోతుందని, మిగిలిన స్థానాల్లో ఎవ్వరైనా ఉండొచ్చని కామెంట్ చేశాడు..

click me!

Recommended Stories