ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ చేస్తే, విరాట్ అవుటైపోతాడు! మన దగ్గర వాళ్లు లేకపోవడం వల్లే... - రవిచంద్రన్ అశ్విన్

Published : Mar 24, 2023, 03:58 PM IST

చాలామంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ విశ్లేషకులుగా మారి యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేసి, తమ అభిప్రాయాన్ని జనాల మీద రుద్దుతుంటే.. అశ్విన్ మాత్రం రిటైర్మెంట్‌కి ముందే యూట్యూబ్ వీడియోలతో క్రికెట్ విశ్లేషకుడిగా మారాడు...

PREV
17
ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ చేస్తే, విరాట్ అవుటైపోతాడు! మన దగ్గర వాళ్లు లేకపోవడం వల్లే... -  రవిచంద్రన్ అశ్విన్
Image credit: PTI

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయింది టీమిండియా. చెన్నైలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయి ఘోర ఓటమి మూటకట్టుకుంది. ఈ టార్గెట్‌ని ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 11 ఓవర్లలోనే ఛేదించి పడేసింది...
 

27
Starc to Kohli

మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ త్వరత్వరగా అవుట్ అయ్యారు. మహ్మద్ సిరాజ్ వికెట్ తీసిన స్టార్క్... ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు...

37

2019 వన్డే వరల్డ్ కప్‌లో ట్రెంట్ బౌల్ట్, టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగా, 2021 టీ20 వరల్డ్ కప్‌లో షాహీన్ ఆఫ్రిదీ భారత జట్టు ఓటమికి కారణమయ్యాడు. దీనికి ప్రధాన కారణం టీమిండియాలో సరైన లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ లేకపోవడమే అంటున్నాడు రవిచంద్రన్ అశ్విన్..
 

47

10. ಟ್ರೆಂಟ್ ಬೌಲ್ಟ್ (ವೇಗದ ಬೌಲರ್)

‘జహీర్ ఖాన్ రిటైర్ అయ్యాక టీమిండియా సరైన లెఫ్ట్ ఆర్మ్ సీమర్‌ని వెతికి పట్టుకోలేకపోయింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ని ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు ఇబ్బంది పడడానికి ఇదే కారణం. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ట్రెంట్ బౌల్ట్ బంతిని స్వింగ్ చేసి, విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు...

57

లెఫ్ట్ ఆర్మ్ పేసర్ స్వింగ్‌ని ఫేస్ చేయడం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నెట్స్‌లో విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీ, ఉమేశ్ యాదవ్‌ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తాడు. ఈ ముగ్గురూ అద్భుతమైన బౌలర్లు. అయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వచ్చేసరికి, ఆ యాంగిల్ పూర్తిగా మారిపోతుంది.. 

67

ఎంత మంది కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ల ఇన్‌స్వింగర్లు వేయగలరు? సరైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేనంత వరకూ మనం ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేం. మిచెల్ స్టార్క్ ఆల్‌టైం గ్రేట్ అయ్యే పనిలో ఉన్నాడని షాన్ టైట్ అన్నాడు.. నన్ను అడిగితే అతను ఇప్పటికే లెజెండ్స్ జాబితాలో చేరిపోయాడు...

77

గ్లెన్ మెక్‌గ్రాత్ లాంటి లెజెండరీ బౌలర్లను ప్రపంచానికి అందించిన ఆస్ట్రేలియా, వన్డేల్లో మిచెల్ స్టార్క్‌ని తీసుకొచ్చింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ బ్రెట్ లీ బౌలింగ్‌తో సమానం... నా అంచనా ప్రకారం వన్డే ఫార్మాట్‌లో స్టార్క్, బ్రెట్ లీని దాటేస్తాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్..

click me!

Recommended Stories