వాళ్లిద్దరినీ తక్కువ అంచనా వేయలేం! పాకిస్తాన్ తాట తీస్తారు... పాక్ మాజీ పేసర్ కామెంట్...

First Published | Oct 21, 2022, 12:16 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాపై పెద్దగా అంచనాలు లేవు.కారణం జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా దూరం కావడంతో భారత బౌలింగ్ విభాగం బలహీనపడింది. బుమ్రా ప్లేస్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కినా, అతను ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. ఆ తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. పాక్, సౌతాఫ్రికాలతో మ్యాచ్‌లు గెలిస్తే మిగిలిన మ్యాచుల్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు... 

‘జస్ప్రిత్ బుమ్రా లేకపోయినా టీమిండియా బౌలింగ్ వీక్ అయిపోదు. ఎందుకంటే మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ చాలా మంచి సీమ్ బౌలర్లు. ఆస్ట్రేలియా పిచ్ మీద ఎలా బౌలింగ్ చేయాలో, ఏ ఏరియాల్లో బౌలింగ్ చేస్తే వికెట్లు పడతాయో వాళ్లకి బాగా తెలుసు...


Mohammed Shami

ఈ ఇద్దరి బౌలింగ్‌లో పాక్ బ్యాటర్లు ఇబ్బంది పడడం ఖాయం. తేలిగ్గా తీసుకుంటే ఈ ఇద్దరూ పాక్ తాట తీస్తారు. షమీ చాలా మంచి సీమ్ బౌలర్. అతనికి ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా చాలా ఉపయోగపడుతుంది...

Bhuvi

భువనేశ్వర్ కుమార్‌కి ఉన్న అనుభవం, పాక్‌లో ఏ బ్యాటర్‌కీ లేదు. అతను రిథమ్ అందుకుంటే పాకిస్తాన్ జట్టుకి కష్టాలు తప్పవు... బుమ్రా లేకపోవడం టీమిండియాకి పెద్ద లోటే కావచ్చు, అయితే భారత జట్టులో మంచి ప్లేయర్లు ఉన్నారు...

Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రా ఉండి ఉంటే టీమిండియా మరింత బలంగా ఉండేది. ఆస్ట్రేలియాలోని పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేస్తూ యార్కర్లు, బౌన్సర్లు, పేస్ వేరియేషన్స్... బుమ్రా స్టార్ బౌలర్‌గా మారేవాడు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకీబ్ జావెద్.. 

Latest Videos

click me!