ధోనీ, విరాట్ కోహ్లీలకే తప్పలేదు! నేనెంత... ట్రోల్స్‌పై విజయ్ శంకర్ రెస్పాన్స్...

First Published Jan 8, 2023, 4:52 PM IST

టన్నుల్లో టాలెంట్ ఉన్నా, టీమిండియాలోకి రావాలంటే అదృష్టం ఉండి తీరాల్సిందే. టీమ్‌లో రావడమే కష్టమనుకుంటే, లక్కీగా వన్డే వరల్డ్ కప్ కూడా ఆడేశాడు విజయ్ శంకర్.  అదే విజయ్ శంకర్ ఆఖరి అంతర్జాతీయ టోర్నీ కూడా అయ్యింది... 

కొన్నాళ్లుగా టీమ్‌లో పాతుకుపోయి నాలుగో స్థానంలో సరైన బ్యాటర్‌గా నిరూపించుకున్న అంబటి రాయుడిని కాదని, విజయ్ శంకర్‌ని వన్డే వరల్డ్ కప్‌ 2019 టోర్నీకి ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. సురేష్ రైనాని కూడా రాదని విజయ్ శంకర్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చారు సెలక్టర్లు...

Virat Kohli and Vijay Shankar

అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్... ‘విజయ్ శంకర్ టీమ్‌కి మూడు విధాలుగా ఉపయోగపడతాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయగలడు. కాబట్టి అతను త్రీడీ ప్లేయర్’ అంటూ కామెంట్ చేశాడు. 

Latest Videos


ఈ కామెంట్ల తర్వాత అంబటి రాయుడు, ‘వన్డే వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ చేశా’ అంటూ ట్వీట్ చేశాడు.. అంబటి రాయుడు చేసిన ఈ ట్వీట్ పెను దుమారం రేపింది. విజయ్ శంకర్‌‌ని ‘త్రీడీ విజయ్ శంకర్’ అని పిలవడం మొదలెట్టారు నెటిజన్లు..

Vijay Shankar

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో వేసిన మొదటి బంతికే వికెట్ తీసిన విజయ్ శంకర్, ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మళ్లీ విజయ్ శంకర్‌కి టీమిండియా నుంచి పిలుపు దక్కలేదు... ఐపీఎల్‌లోనూ విజయ్ శంకర్ అట్టర్ ఫ్లాప్ అవుతూ రావడంతో అతనిపై ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి...

‘ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఇంకా చాలా మంది టాప్ ప్లేయర్లు ట్రోలింగ్ ఎదుర్కోవడం చూశాను. జనాలు, అలాంటి వాళ్లను కూడా వదల్లేదు. బాగా ఆడుతున్నప్పుడు ఆహో... ఓహో అని పొగుడుతారు. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇష్టం వచ్చినట్టు తిడతారు...
 

పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయం జనాలకు తెలీదు, చెప్పినా అర్థం కాదు.. అందుకే నేను అవన్నీ పట్టించుకోవడం ఎప్పుడో మానేశా... నా వరకూ పర్ఫామెన్స్‌లో బెస్ట్ ఇవ్వడంపైనే ఫోకస్ పెట్టా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత క్రికెటర్ విజయ్ శంకర్...

click me!