హార్ధిక్ పాండ్యాను కూడా భారత జట్టుకు ఎంపిక చేయను... నా లెక్కలు వేరే రేంజ్‌లో ఉంటాయి....

First Published | Nov 30, 2020, 5:17 PM IST

కామెంటేటర్‌గా అత్యంత వివాదాస్పదంగా మారాడు సంజయ్ మంజ్రేకర్. రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా వంటి ప్లేయర్లపై చీప్ కామెంట్లు చేసి, కామెంటరీ ప్యానెల్ నుంచి బహిష్కరణకు కూడా గురైన ఈ మాజీ క్రికెటర్... మరోసారి తన నోటి దురదను చూపించాడు. భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న పాండ్యాపై హాట్ కామెంట్లు చేశాడు సంజయ్ మంజ్రేకర్.

భారత జట్టు ఎంపిక తనకి ఏ మాత్రం నచ్చడం లేదని చెప్పిన సంజయ్ మంజ్రేకర్, అరకోర టాలెంట్ ఉన్న వారినే గొప్ప ఆల్‌రౌండర్లుగా టీమిండియాలో స్థానం సంపాదించుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కొన్నాళ్ల క్రితం ‘రవీంద్ర జడేజా బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్’ అంటూ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే...

ఈ కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న రవీంద్ర జడేజా... సంజయ్ మంజ్రేకర్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘నాలుగ కంట్రోల్‌లో పెట్టుకో... నీ కంటే ఎక్కువే మ్యాచులు ఆడాను నేను’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు జడ్డూ.
జడేజాపై చేసిన వ్యాఖ్యలు, ట్వీట్ల కారణంగానే బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ నుంచి సంజయ్ మంజ్రేకర్‌ను బహిష్కరించింది భారత క్రికెట్ బోర్డు.
‘నాకు హార్ధిక్ పాండ్యా లాంటి వాళ్లు భారత జట్టులోకి రావడం వల్ల వ్యక్తిగతంగా ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. కానీ ఆల్‌రౌండర్ అంటే బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ మంచి ప్రతిభ చూపాలి. అంతేకానీ బ్యాట్ చేస్తూ బౌలింగ్ చేయగలగడం మాత్రమే తెలిస్తే సరిపోదు..
హార్ధిక్ పాండ్యా కూడా అలాంటి వాడే. నేను సెలక్టర్‌గా ఉండే హార్ధిక్ పాండ్యాను కూడా భారత జట్టుకు ఎంపిక చేయను. అదివారికి ఎక్కువ విలువ ఇచ్చినట్టు అవుతుంది...
నేను ఓ సూత్రాన్ని అనుసరించి జట్టును ఎంపిక చేస్తాను. భారత జట్టుకి ఎంపికయ్యే క్రికెటర్లకు క్రమశిక్షణ కూడా ఉండాలి... జడేజాతో నాకు ఎలాంటి సమస్య లేదు. పాండ్యాలాంటి క్రికెటర్లతో పాటు నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యా లేదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.
‘నా జట్టులో హార్ధిక్ పాండ్యాకు కూడా స్థానం ఇవ్వను. జట్టుకి వీళ్లు భారంగా మారతారు. టెస్టు ఫార్మాట్‌లో రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ కావాలి, వన్డేలకి మాత్రం వీళ్లు సరిపోరు’ అంటూ వ్యాఖ్యానించాడు సంజయ్ మంజ్రేకర్.

Latest Videos

click me!