కోహ్లీ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోతోందనడం సిగ్గు చేటు... ఒక్కడే ఏమీ చేయలేడు...

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది టీమిండియా. భారత బౌలర్లు ఘోరంగా విఫలం కావడంతో పాటు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఫెయిల్ అయ్యాయి. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడని తీవ్రంగా విమర్శలు వస్తున్న సమయంలో కెప్టెన్‌కి మద్ధతుగా నిలిచాడు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్.

వెన్నునొప్పితో గాయపడుతున్న నవ్‌దీప్ సైనీని ఆడించడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అతను మొదటి మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చినా రెండో మ్యాచ్‌లోనూ ఆడించాడు విరాట్.
బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తుంటే... ప్రత్యామ్నాయ బౌలర్ లేక తెగ ఇబ్బంది పడింది భారత జట్టు. దీనికి విరాట్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి...

అయితే ఎలాంటి ప్లేయర్ అయినా ఒంటి చేత్తో విజయాన్ని అందించలేడని కామెంట్ చేశాడు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్... కెప్టెన్‌కి బౌలర్ల సహకారం లేకుంటే ఎవ్వరూ ఏం చేయలేరని అన్నాడు.
‘కోహ్లీకి కెప్టెన్సీ ఏ మాత్రం భారం కాదు... అతను టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. కెప్టెన్‌గా విరాట్ ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదు...
విరాట్ కోహ్లీ నిజమైన లీడర్... కెప్టెన్సీ అతనికి ఏ మాత్రం భారం కాదు. ఓ కెప్టెన్‌గా రాణిస్తూ, జట్టును నడిపించిన సారథి అతను... విరాట్‌ను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు’ అంటూ వ్యాఖ్యానించాడు హర్భజన్ సింగ్.
‘కేవలం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోతోందని కామెంట్ చేయడం సిగ్గు చేటు. అతను ఒక్కడే మ్యాచ్‌ను గెలిపించలేదు. ముఖ్యంగా బౌలర్లు రాణించనప్పుడు కెప్టెన్ మాత్రం ఏం చేయగలడు...’ అంటూ విరాట్‌కి మద్ధతు ప్రకటించాడు భజ్జీ.
రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్‌ను త్వరగా అవుట్ చేసి ఉంటే, ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా అడ్డుకునేవాళ్లం. కానీ బౌలర్లు ఆ పని చేయలేదు. స్మిత్ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు స్పిన్నర్లతో బౌలింగ్ చేసి పరీక్షిస్తే బెటర్... అని చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్.
రెండు వన్డేల్లో ఘోరంగా ఫెయిల్ అయిన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి కూడా సపోర్ట్ చేశాడు హర్భజన్ సింగ్. ఆస్ట్రేలియా పిచ్‌లు స్పిన్‌కి పెద్దగా అనుకూలించవని చెప్పిన భజ్జీ, నెమ్మదిగా బంతిని వదిలితే మంచి ఫలితం రాబట్టవచ్చని సలహా ఇచ్చాడు.

Latest Videos

click me!