వార్నర్‌ గాయం పెద్దదైతే బావుండు... భారత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌ ఫన్నీ కామెంట్...

First Published Nov 30, 2020, 3:20 PM IST

మొదటి రెండు మ్యాచుల్లో ఓడి, వన్డే సిరీస్‌ను కోల్పోయింది టీమిండియా. మొదటి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు డేవిడ్ వార్నర్. అయితే ఫీల్డింగ్ చేసే సమయంలో వార్నర్ గాయపడడంతో మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్ గాయపడడంతో అతనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్.

రెండో వన్డేలో గాయపడిన డేవిడ్ వార్నర్... నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఎక్స్‌రే కోసం కుంటుతూనే కారు ఎక్కిన వార్నర్ గాయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు వార్నర్.
undefined
‘వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినా మేం పాజిటివ్‌గా ఉన్నాం. మా ఆలోచనావిధానం ఇంకా పాజిటివ్‌గానే ఉంది. కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా... ప్రత్యర్థి మాకంటే మెరుగ్గా ఆడింది...
undefined

Latest Videos


వారి దేశంలో సిరీస్ ఆడడం వారికి బాగా కలిసి వస్తోంది... మా బ్యాటింగ్ బాగానే ఉంది, బౌలింగ్ మెరుగవ్వాలి... త్వరగా వికెట్లు తీయడానికి మా బౌలర్లు బాగా కష్టపడుతున్నారు...
undefined
డేవిడ్ వార్నర్‌కి అయిన గాయం కొంచెం పెద్దది అయితే బాగుండు. ఓ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా సాటి ప్లేయర్‌కి గాయం అవ్వాలని కోరుకోకూడదు కానీ మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్ జట్టుకు దూరమవ్వాలని కోరుకుంటున్నా... ’ అంటూ నవ్వేశాడు కెఎల్ రాహుల్.
undefined
‘బుమ్రా ఎలాంటి బౌలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను కమ్ బ్యాక్ ఇస్తాడు. మళ్లీ వికెట్లు తీసి తానెంటో నిరూపించుకున్నాడు... సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంది. అందుకే అతనికి వికెట్లు దక్కలేదు...’ అంటూ వ్యాఖ్యానించాడు కెఎల్ రాహుల్.
undefined
మొదటి రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న జస్ప్రిత్ బుమ్రా... రెండు మ్యాచుల్లో కలిపి రెండు వికెట్లు మాత్రమే తీశాడు...
undefined
మొదటి వన్డేలో ఫెయిల్ అయినా రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు కెఎల్ రాహుల్...
undefined
66 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్... వన్డేల్లోఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో భారత బ్యాట్స‌్‌మెన్‌గా రోహిత్, సెహ్వాగ్ తర్వాతి స్థానంలో నిలిచాడు కెఎల్ రాహుల్.
undefined
click me!