ఆ స్పిన్నర్ రావడంతో మా జట్టు మరింత బలపడింది... కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్

First Published Apr 1, 2021, 9:54 AM IST

ఐపీఎల్ 2020 సీజన్‌ మధ్యలో దినేశ్ కార్తీక్ నుంచి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు ఇయాన్ మోర్గాన్. సీజన్ 2020లో ఓవరాల్‌గా కాస్త మెరుగైన ప్రదర్శనే ఇచ్చినా, ప్లేఆఫ్‌కి అడుగు దూరంలో నిలిచిపోయింది కేకేఆర్...

భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రాకతో తమ స్పిన్ యూనిట్ మరింత బలపడిందని, ఈసారి మ్యాజిక్ చేస్తామని అంటున్నాడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్...
undefined
‘హర్భజన్ సింగ్ రాకతో మా స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది. రికార్డులను చూసుకున్నా, మా స్పిన్నర్లు అదరగొడుతున్నారు. మేం ఎక్కువ మ్యాచులు చెన్నైలో ఆడబోతున్నాం...
undefined
చెన్నై పిచ్‌లు స్పిన్‌కి బాగా అనుకూలిస్తాయని అందరికీ తెలిసిందే. అలా చూసుకున్నా మా స్పిన్నర్లు మెరుగైన ప్రదర్శన ఇస్తే... ఈసారి మేం అద్భుతంగా రాణిస్తాం..’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు ఇయాన్ మోర్గాన్...
undefined
ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియా తరుపున ఆరంగ్రేటం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్న మోర్గాన్, టాస్ తర్వాత అతన్ని కలిసి కంగ్రాట్స్ చెప్పినట్టు తెలిపాడు...
undefined
‘ప్రసిద్ధ్ కృష్ణ ఆరంగ్రేటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. టాస్ తర్వాత వెళ్లి కంగ్రాట్స్ చెప్పాను. నా వరకూ ఓ ఆటగాడి ఆరంగ్రేటం అతనికి మాత్రమే అతని కుటుంబానికి, స్నేహితులకు కూడా పండగే...’ అంటూ చెప్పాడు ఇయాన్ మోర్గాన్.
undefined
2008 నుంచి 2017 దాకా ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న హర్భజన్ సింగ్, 2018, 19 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు.
undefined
వ్యక్తిగత కారణాల వల్ల 2020 సీజన్‌కి దూరంగా ఉన్నాడు హర్భజన్ సింగ్. సురేశ్ రైనాతో పాటు హర్భజన్ సింగ్ దూరం కావడంతో వరుస మ్యాచుల్లో ఓడి, ఫ్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది చెన్నై సూపర్ కింగ్స్...
undefined
ఇదే సమయంలో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి హర్భజన్ సింగ్ చేసిన కామెంట్లు, ట్వీట్లు కూడా అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి దూరం కావడానికి కారణమయ్యాయి....
undefined
తొలి రౌండ్‌లో అమ్ముడుపోని హర్భజన్ సింగ్‌ను, రెండో రౌండ్‌లో బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది కేకేఆర్. కేకేఆర్‌కి ఆడడం సంతోషంగా ఉందన్న భజ్జీ, ఈసారి వారికి కప్ అందించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు.
undefined
గత సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అదరగొట్టిన యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి కేకేఆర్ స్పిన్ బౌలింగ్‌ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు హర్భజన్ సింగ్.
undefined
click me!