ధోనీతో స్టీవ్ స్మిత్‌కి పోలికా... మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు...

First Published Apr 1, 2021, 9:17 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ... ఓ లెజెండరీ క్రికెటర్. భారత జట్టుకి కెప్టెన్‌గానే కాకుండా ఐపీఎల్‌లో కూడా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడు. 14 సీజన్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఒకే ఒక్క ప్లేయర్ కూడా ధోనీయే...

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచి రెండో సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీగా ఉంది... అయితే గత సీజన్‌లో చెన్నై ఏడో స్థానంలో నిలిచింది...
undefined
వరుస పరాజయాలతో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై ప్లేఆఫ్ చేరకపోవడం ఇదే తొలిసారి...
undefined
అయితే 2017 సీజన్‌లో పూణె జట్టుకి మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. పూణె ఫైనల్‌కి అర్హత సాధించడానికి కారణం స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ అని కొందరు, మాహీ మ్యాజిక్ అని మరికొందరు వ్యాఖ్యానించారు...
undefined
రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా రాణించిన రజత్ భాటియా మాత్రం ఆర్‌పీఎస్‌ ఫైనల్ చేరడంలో పూర్తి క్రెడిట్ మహేంద్ర సింగ్ ధోనీకే దక్కుతుందని వ్యాఖ్యానించాడు..
undefined
‘దేశీయ ప్లేయర్ల టాలెంట్ గురించి బాగా తెలిసిన కెప్టెన్ ఎప్పుడూ సక్సెస్‌ఫుల్ అవుతాడు... స్టీవ్ స్మిత్‌కి రాహుల్ త్రిపాఠి ఏ జట్టుకి ఆడతాడు, ఏ పొజిషన్‌లో ఆడతాడో కూడా తెలీదు...
undefined
రైజింగ్ పూణె సూపర్ జైయింట్స్ ఫైనల్ చేరడానికి మహేంద్ర సింగ్ ధోనీయే కారణం, స్టీవ్ స్మిత్ కాదు... ’ అంటూ వ్యాఖ్యానించాడు రజత్ భాటియా...
undefined
2017 ఫైనల్‌లో రైజింగ్ పూణె, ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడి, రన్నరప్‌గా నిలిచింది... ఆ తర్వాత స్టీవ్ స్మిత్‌పై ఏడాది నిషేధం పడడం, గత సీజన్‌లో రాజస్థాన్‌కి కెప్టెన్‌గా వ్యవహరించడం జరిగిపోయాయి.
undefined
గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ కెరీర్‌లో ఆర్ఆర్‌కి ఇది చెత్త రికార్డు. దీంతో కెప్టెన్ స్మిత్‌ను వేలానికి వదిలేసింది రాజస్థాన్ రాయల్స్...
undefined
మొదటి రౌండ్‌లో అమ్ముడుపోని స్టీవ్ స్మిత్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయ్యర్ గైర్హజరీతో స్మిత్‌కి కెప్టెన్సీ దక్కుతుందని ప్రచారం జరిగినా, రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
undefined
click me!