క్రికెట్ ప్రపంచంలోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కి సెపరేట్ క్రేజ్ ఉంది. దాయాదులు భారత్, పాకిస్తాన్ మ్యాచుల తర్వాత అంతటి క్రేజ్ యాషెస్ సిరీస్‌కే. అయితే ఈసారి బూడిద సిరీస్ ఆ మజాని ఇవ్వలేకపోతోంది...
ఆస్ట్రేలియాలో అడుగుపెట్టేందుకు బయో బబుల్ నిబంధనలను సవరించాలని, లేకపోతే యాషెస్ సిరీస్ నుంచే తప్పుకుంటామని హెచ్చరించిన ఇంగ్లాండ్ క్రికెటర్లు, అన్ని సమకూర్చిన తర్వాత ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు...
211
బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లాండ్, ఆ తర్వాత ఆడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో 275 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...
311
సిరీస్‌పై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులోనూ కనీస పోరాట ప్రటిమ చూపించలేకపోయింది ఇంగ్లాండ్. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే కుప్పకూలింది...
411
సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో పాటు రాబిన్‌సన్, మార్క్ వుడ్ కలిసి చెలరేగి ఆస్ట్రేలియాని తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకే ఆలౌట్ చేశారు. అయినా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కి 82 పరుగుల ఆధిక్యం దక్కింది...
511
ఈ స్వల్ప ఆధిక్యాన్ని కూడా అధిగమించలేక రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది...
611
ఇందులో కెప్టెన్ జో రూట్ చేసిన 28 పరుగులు, ఎక్స్‌ట్రాలు 5 తీసేస్తే... మిగిలిన 10 మంది కలిసి చేసింది 35 పరుగులే...
711
ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత ఊహించని రితీలో కమ్‌బ్యాక్ ఇచ్చి, సిరీస్‌నే సొంతం చేసుకుంది భారత జట్టు...
811
విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, అశ్విన్, జడేజా వంటి సీనియర్లు లేకుండా గబ్బాలో ఆస్ట్రేలియాకి 33 ఏళ్ల తర్వాత పరాజయాన్ని రుచి చూపించింది భారత జట్టు...
911
ఇప్పుడు ఇంగ్లాండ్ పరిస్థితి చూస్తుంటే, వారికి ఓ ఇండియన్ కోచ్ అవసరం చాలా ఉందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఆసీస బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో గబ్బాలో రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ చూసి నేర్చుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు...
1011
ఈ ఏడాది మార్చిలో భారత్‌లో జరిగిన తొలి టెస్టు నెగ్గిన ఇంగ్లాండ్, ఆ తర్వాత ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతోంది. చెన్నై టెస్టు తర్వాత వరుసగా మూడు టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్, స్వదేశంలో న్యూజిలాండ్‌తోనూ టెస్టు సిరీస్‌ను కోల్పోయింది...
1111
భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ నాలుగు టెస్టుల్లో రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు... వర్షం కారణంగా మొదటి టెస్టులో పరాజయం నుంచి లక్కీగా గట్టెక్కింది...